Charles III Coronation: కాబోయే బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 గురించి A టు Z

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం గురించి తెలియనిది ఎవరికి !! దానికి ఇప్పటివరకు రాణులే నాయికలుగా వ్యవహరించారు.. తొలిసారిగా ఒక రాజు దానికి నాయకత్వం వహించబోతున్నాడు.. ఆయనే ఛార్లెస్‌-3 (Charles III) !!

  • Written By:
  • Updated On - May 5, 2023 / 11:15 PM IST

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం గురించి తెలియనిది ఎవరికి !! దానికి ఇప్పటివరకు రాణులే నాయికలుగా వ్యవహరించారు.. తొలిసారిగా ఒక రాజు దానికి నాయకత్వం వహించబోతున్నాడు.. ఆయనే ఛార్లెస్‌-3 (Charles III) !! శనివారం (మే 6న) లండన్ లోని వెస్ట్‌ మినిస్టర్ అబే వేదికగా ఛార్లెస్‌-3కి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం (Coronation)  జరగబోతోంది. 1953 తర్వాత బ్రిటన్‌లో ఇదే తొలి పట్టాభిషేకం. వందల ఏళ్లనాటి సంప్రదాయాల ప్రకారం జరిగే ఈ వేడుకలో ఛార్లెస్‌ రాజుగా, ఆయన భార్య కెమిల్లా రాణిగా కిరీటాలు ధరిస్తారు. ఈనేపథ్యంలో బ్రిటన్ రాజు చార్లెస్ 3 గురించి A టు Z వివరాలు ఇవీ..

* A ఫర్ “యాక్షన్ మ్యాన్”

చార్లెస్ (Charles III) తన డేర్‌డెవిల్ యవ్వనంలో విమానాల నుంచి దూకడం, జలాంతర్గాముల నుంచి తప్పించుకోవడం, విండ్‌ సర్ఫింగ్, పోలో ఆడటం, వాటర్‌ స్కీయింగ్‌లో మంచి నైపుణ్యం సంపాదించారు.

* B ఫర్ “బ్లాక్ స్పైడర్ మెమోస్”

చార్లెస్.. రాజు కావడానికి ముందు “బ్లాక్ స్పైడర్ మెమోస్” పేరుతో లేఖలు రాసి బ్రిటన్ ప్రభుత్వ మంత్రులను ఉక్కిరిబిక్కిరి చేశారు.

* C ఫర్ “కెమిల్లా”

చార్లెస్ జీవితంలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మొదటి భార్య డయానాతో 1981లో పెళ్లి అయింది. 1996లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన 9 ఏళ్ళ తర్వాత 2005లో కెమిల్లాను మ్యారేజ్ చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కెమిల్లాకు 1973లో యాండ్రు పార్కర్ బౌల్స్ తో పెళ్లి అయింది. అయితే యాండ్రు పార్కర్ బౌల్స్ కు 1995లో కెమిల్లా విడాకులు ఇచ్చి.. 1996 చివరి నుంచి చార్లెస్ తో డేటింగ్ చేశారు. చివరకు చార్లెస్, కెమిల్లా 2005లో పెళ్లితో ఒక్కటయ్యారు.

* D ఫర్ “డయానా”చార్లెస్ కు డయానాతో 1981లో పెళ్లి అయింది. వారు 1992లో విడిపోయారు. 1996లో ఆగస్టు 28న విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన సరిగ్గా ఏడాది తర్వాత 1997 ఆగస్టు 31న కారు ప్రమాదంలో డయానా చనిపోయింది.

* E ఫర్ “ఎన్విరాన్మెంట్”

చార్లెస్ (Charles III) ఒక పర్యావరణవేత్త. ఆయనకు పర్యావరణ పరిరక్షణ, సేంద్రీయ వ్యవసాయం అంటే ఎంతో ఆసక్తి. వాతావరణ మార్పులపై చాలా ఏళ్ళ కిందటే చార్లెస్ ఎన్నో వేదికల్లో మాట్లాడారు.

* F ఫర్ “ఫెయిత్”

అన్ని మత విశ్వాసాల స్వేచ్ఛా భావనకు చార్లెస్ ప్రాధాన్యత ఇస్తారు. పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా చివరిలో చార్లెస్ వివిధ మతాల పెద్దల నుంచి ఆయన శుభాకాంక్షలు అందుకుంటారు.

ALSO READ : King Charles : కింగ్ చార్లెస్‌పై గుడ్లు విసిరిన దుండ‌గులు.. ఒక‌రు అరెస్ట్‌

* G ఫర్ “Gordonstoun”

Gordonstoun అనే స్కాటిష్ బోర్డింగ్ స్కూల్‌లో చార్లెస్ కొన్నేళ్లు చదువుకున్నాడు. ఆ స్కూల్ టైం ను తలుచుకోవడానికి చార్లెస్ ఇష్టపడరు. అక్కడ ఎంతో కష్టంగా తాను ఉండేవాడినని చెప్పారు. అక్కడ తాను ఒంటరి “జైలు శిక్ష”లా గడిపానని చార్లెస్ అంటారు. అయితే తన క్యారెక్టర్ నిర్మాణంలో ఆ స్కూల్ కీలక పాత్ర పోషించిందన్నారు.

* H ఫర్ “హైగ్రోవ్”

నైరుతి ఇంగ్లండ్‌లోని గ్లౌసెస్టర్‌ షైర్‌లో చార్లెస్‌కు ఉన్న ఫెవరేట్ ఇంటిపేరు హైగ్రోవ్ .. 1980లో కొన్న ఈ 3 అంతస్తుల జార్జియన్ నియో క్లాసికల్ భవనం చుట్టూ అందమైన మైదానాలు, భవనం లోపల చక్కటి ఇంటీరియర్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 40,000 మంది ఇక్కడి మైదానాన్ని చూడటానికి వస్తుంటారు.

* I ఫర్ “ఇన్వెస్టి ట్యూర్”

చార్లెస్‌ 1969లో 20 ఏళ్ల వయస్సులో కెర్నార్‌ఫోన్ కాజిల్‌లో వేల్స్ యువరాజుగా పట్టాభిషక్తుడయ్యాడు. ఆ కార్యక్రమంలో ఆయన వేల్స్ ప్రాంతీయ భాష వెల్ష్‌లో ప్రసంగం చేశారు.
స్వయంగా క్వీన్ ఎలిజబెత్ II చార్లెస్‌ తలపై కిరీటాన్ని ఉంచారు.

* J ఫర్ “జూబ్లీ ప్రసంగాలు”

క్వీన్ ఎలిజబెత్ యొక్క 2002, 2012, 2022 సంవత్సరాల జూబ్లీ వేడుకల చివర్లో చార్లెస్ (Charles III) మాట్లాడుతూ తన తల్లిని “మమ్మీ” అని పిలిచారు.

* K ఫర్ “నాచ్‌ బుల్”

1979లో చార్లెస్.. లార్డ్ మౌంట్ బాటన్ మనవరాలు అమండా నాచ్‌బుల్‌కి ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె తిరస్కరించింది.

* L ఫర్ “విధేయత”

“నా జీవితాంతం విధేయత, గౌరవం, ప్రేమతో మీకు సేవ చేయడానికి నేను ప్రయత్నిస్తాను” అని చార్లెస్ రాజు అయిన తర్వాత తన మొదటి ప్రసంగంలో ప్రతిజ్ఞ చేశాడు.

* M ఫర్ “మౌంట్ బాటన్”

లూయిస్ మౌంట్‌బాటెన్.. చార్లెస్ కు మేనమామ. ఆయనను చార్లెస్ గురువు, అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. 1979లో ఐరిష్ రిపబ్లికన్ పారా మిలిటరీ చేతిలో లూయిస్ మౌంట్‌బాటెన్ హత్యకు గురయ్యాడు.

* N ఫర్ “నేవీ”

చార్లెస్ 1971 నుంచి 1976 వరకు నేవీలో పనిచేశాడు. కరేబియన్, పసిఫిక్ సముద్రాల చుట్టూ పనిచేశాడు. హెలికాప్టర్లను నడపడం కూడా నేర్చుకున్నాడు.

* O ఫర్ “సంతానం”

ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ… చార్లెస్ (Charles III) కొడుకులు. హ్యారీ రాజ బాధ్యతలను విడిచిపెట్టి భార్యతో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్ళిపోయాడు.

* P ఫర్ “ప్రిన్స్ ట్రస్ట్”

చార్లెస్ చాలా ఏళ్ళ క్రితం నేవీలో పనిచేసినప్పుడు 7,500 పౌండ్ల శాలరీ వచ్చింది. ఆ డబ్బుతో ప్రిన్స్ ట్రస్ట్‌ను ప్రారంభించాడు. దాని ద్వారా ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది వెనుకబడిన యువకులకు సహాయం చేశారు.

* Q ఫర్ “క్వీన్ మదర్”

చార్లెస్ కు తన ప్రియమైన అమ్మమ్మ క్వీన్ ఎలిజబెత్ అంటే ఇష్టం. 2002లో ఆమె మరణానంతరం మాట్లాడుతూ.. “నాకు ప్రతిదీ మా అమ్మమ్మే” అని చెప్పాడు.

* R ఫర్ “నివాసాలు”

చార్లెస్ అధికారిక నివాసం పేరు బకింగ్‌హామ్ ప్యాలెస్. అయితే అతను సమీపంలోని క్లారెన్స్ హౌస్‌లో ఎక్కువ సమయం గడుపుతుంటారు. చార్లెస్ తూర్పు ఇంగ్లాండ్‌లోని ప్రైవేట్ సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్, స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ ఎస్టేట్‌ను వారసత్వంగా పొందాడు. ప్రఖ్యాత హైగ్రోవ్‌ బిల్డింగ్ కూడా ఉంది.

* S ఫర్ “స్టైల్”

చార్లెస్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా పాతది. 1968 మోడల్ బూట్లు, 1985 మోడల్ కోటు, డబుల్ బ్రెస్ట్ సూట్లను ధరించేందుకు ఆయన ఇష్టపడతారు.

ALSO READ : King Charles: కరెన్సీ నోట్లపై కింగ్ చార్లెస్ ఫొటో.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం

* T ఫర్ “ట్రాన్సిల్వేనియా”

బ్రిటన్ రాజ కుటుంబం.. రొమేనియాకు చెందిన ప్రాచీన రాజు వ్లాడ్ ది ఇంపాలర్ వంశానికి చెందినదని అంటారు. ఈనేపథ్యంలో చార్లెస్ రొమేనియాలో అనేక ఆస్తులను కొనుగోలు చేసి పునరుద్ధరించాడు.

*U ఫర్ “యూనివర్సిటీ”

చార్లెస్(Charles III) ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ట్రినిటీ కాలేజీలో చదువుకున్నారు. 1970లో 2:2 గ్రేడ్ తో పట్టభద్రుడయ్యాడు. చార్లెస్ కు హిస్టరీ అంటే ఇంట్రెస్ట్. ఆయన పీజీ మాస్టర్స్ లో ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ సబ్జెక్టుల నుంచి హిస్టరీకి మారారు.

* V ఫర్ ” విజన్ ఆఫ్ బ్రిటన్”

చార్లెస్ కు నిర్మాణ రంగం, ఆర్కిటెక్చర్ అంటే ఇష్టం. ఆయన 1989 పుస్తకంలో ఈ వివరాలు కనిపిస్తాయి. స్థానిక సంప్రదాయానికి అనుగుణంగా సిటీలు డెవలప్ చేయాలని ఆయన అంటారు. తన ఆలోచనలకు అనుగుణంగా పౌండ్‌బరీ అనే మోడల్ సబర్బ్ ను నిర్మించారు.

* W ఫర్ “వేల్స్”

క్వీన్ ఎలిజబెత్ II 1958లో తొమ్మిదేళ్ల వయసులోనే చార్లెస్‌ను వేల్స్ యువరాజుగా చేసింది. అతను ప్రతి వేసవిలో వేల్స్‌లో పర్యటించాడు. 2006లో తన వెల్ష్ హోమ్‌గా Lwynywermod అనే ఫామ్‌హౌస్ ను కొనుగోలు చేశాడు. అతను వెల్ష్‌లో తన పట్టును నిలుపుకున్నాడు.

* X ఫర్ “X-రేటెడ్”

భార్య డయానా ఉండగానే 1989లో కెమిల్లా, చార్లెస్‌ మధ్య సాగిన ఫోన్‌కాల్ రికార్డ్స్ ను .. 1993లో అప్పటి న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేయడం కలకలం రేపింది. ఆ వార్తలు చార్లెస్‌ ను ఆనాడు ఎంతో అసౌకర్యానికి గురి చేశాయి.

* Y ఫర్ ఇయర్స్

1952లో మూడేళ్ల వయస్సు నుంచి 2022 వరకు వేల్స్‌ యువరాజుగా చార్లెస్ (Charles III) వ్యవహరించారు. బ్రిటీష్ చరిత్రలో ఇంత ఎక్కువ కాలం పాటు యువరాజుగా పనిచేసిన వారసుడు చార్లెస్ మాత్రమే.

* Z ఫర్ జాజా
జిన్ , డుబోనెట్ అనే ఆల్కహాలిక్ డ్రింక్ లను భోజనానికి ముందు తాగడానికి చార్లెస్ ఇష్టపడతారు.