Site icon HashtagU Telugu

Landslide : సూడాన్‌లో తీవ్ర విషాదం..కొండ చరియలు విరిగి 1000 మందికి పైగా మృతి

A terrible tragedy in Sudan.. More than 1000 people died in landslides

A terrible tragedy in Sudan.. More than 1000 people died in landslides

Landslide : పశ్చిమ సూడాన్‌లోని డార్ఫూర్ ప్రాంతంలో జరిగిన ఘోర ప్రకృతి విపత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మర్రా పర్వత ప్రాంతంలో సంభవించిన భారీ కొండచరియల విరిగిపడే ఘటనలో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో భూమి సంభాలుకోలేని స్థితికి చేరింది. ఈ విపత్తులో ఒక పూర్తి గ్రామం శిథిలాల కిందకు దిమ్మతిరిగిపోయింది. గ్రామంలోని ప్రజలంతా మరణించగా, కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగాడు. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులున్నట్టు సమాచారం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నా, మృతదేహాల వెలికితీత కష్టతరంగా మారిందని అధికారులు తెలిపారు.

Read Also: Kaleshwaram Project : ఢిల్లీకి చేరిన కాళేశ్వరం వ్యవహారం..కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ

సెప్టెంబర్ 2న సోమవారం ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన సుడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ ఒక అధికారిక ప్రకటనలో ప్రాణనష్ట వివరాలను ధృవీకరించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామం పూర్తిగా కొండచరియల కింద కూరుకుపోయింది. సహాయక బృందాలు శిథిలాల మధ్యను తవ్వడం కూడా సాధ్యపడడం లేదని పేర్కొన్నారు. ఈ విపత్తుపై ఐక్యరాజ్యసమితి (UN) స్పందిస్తూ, వెంటనే మానవతా సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని, మృతదేహాల వెలికితీతకు మరియు గాయపడిన వారికీ సహాయమందించాల్సిందిగా అంతర్జాతీయ సంస్థలను కోరింది. ఇప్పటికే సూడాన్ దేశం అంతర్యుద్ధ వేళ్లలో కూరుకుపోయింది. గత రెండేళ్లుగా సూడాన్ సైన్యం మరియు పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా లక్షలాది ప్రజలు తమ గృహాలను వదిలి ఆశ్రయం కోసం మార్రా పర్వతాలవైపు వెళ్లారు. అయితే అక్కడ మౌలిక వసతుల కల్పన లేకపోవడం, ఆహారం, నీరు, మందుల కొరత మరింత విషమ పరిస్థితులను కలిగించాయి.

ఈ తరుణంలో కొండచరియలు విరిగిపడటం, సహాయ చర్యలకు సంబంధించిన మార్గాలను కూడా అడ్డుకోవడం దేశవ్యాప్తంగా ఉద్వేగాన్ని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం సూడాన్‌లో సగం కన్నా ఎక్కువ జనాభా ఆకలితో బాధపడుతున్నదనే వాస్తవం మరింత బాధాకరం. ఇది జరిగిన సమయంలో, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. దేశం ఆగ్నేయ భాగాన్ని కేంద్రంగా తీసుకుని వచ్చిన ప్రకంపనలు కారణంగా వేలాది ఇళ్లు కూలిపోయాయి. అధికారికంగా ఇప్పటివరకు 800 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. వందలాది మంది గాయపడగా, శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

Read Also: Weather Updates : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..!