Accident: ఘోర రోడ్డు ప్రమాదం..40 మంది దుర్మరణం..78 మందికి తీవ్ర గాయాలు!

ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సరైన ఫలితం ఉండటం లేదు.

  • Written By:
  • Publish Date - January 8, 2023 / 09:36 PM IST

Accident: ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సరైన ఫలితం ఉండటం లేదు. ఇటీవలె తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడంతో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 78 మంది వరకూ గాయాలపాలయ్యారు. బస్సు టైరు పంక్చర్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.

పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనగల్ లో కఫ్రీన్ ప్రాంతంలోని నివీ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మూడున్నర గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ దేశ అధ్యక్షుడు మాక్కీ సాల్ ఈ ప్రమాదం గురించి వివరాలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

సెనగల్ ప్రాంతంలోని ఒకటవ నెంబర్ జాతీయ రహదారిలో బస్సులో ప్రయాణిలు ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైరు పంక్చర్ కావడం వల్ల రోడ్డుకు అవతలి వైపు బస్సు వెళ్లిపోయింది. అయితే ఆ సమయంలో అవతలి వైపు ఓ బస్సు వస్తుండగా ఆ బస్సును ఢీకొంది. రెండు బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి.

నివీ గ్రామంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 40 మంది దుర్మరణం చెందారు. 78 మందికి గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు దేశ వ్యాప్తంగా సంతాప దినాలు పాటించాలని వెల్లడించారు. అధ్వానంగా ఉన్న రోడ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలను అరికట్టడానికి తాను వెంటనే చర్యలు తీసుకుంటానని తెలిపారు.