100 People Died : 100 మంది సజీవ దహనం.. పెళ్లి వేడుకలో విషాదం

100 People Died : పెళ్లి వేడుక వేళ విషాదం అలుముకుంది.

Published By: HashtagU Telugu Desk
100 People Died

100 People Died

100 People Died : పెళ్లి వేడుక వేళ విషాదం అలుముకుంది. బాణాసంచా పేల్చడంతో సంభవించిన అగ్నిప్రమాదం అక్కడికి వచ్చిన అతిథుల్లో వంద మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇరాక్ లోని అల్ హమ్దానియా పట్టణంలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్‌లో వివాహ వేడుక జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో 100 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 150 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని హమ్దానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈవివరాలను ఇరాక్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో నూతన వధూవరులు కూడా ఉన్నారని తెలిపారు.  ఫంక్షన్ హాల్ లో వినియోగించిన బాణాసంచా వల్ల ఈ అగ్నిప్రమాదం జరిగిందని ఇరాక్ పౌర రక్షణ విభాగం ప్రాథమిక నివేదికలను బట్టి తెలుస్తోంది. మంటల ధాటికి ఫంక్షన్ హాలు పూర్తిగా (100 People Died)  కాలిపోయింది.

Also read : Virat Kohli ODI Retirement: 2023 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ వన్డే, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు..?!

  Last Updated: 27 Sep 2023, 07:14 AM IST