Statue of Vladimir Putin: అభ్యంత‌ర‌క‌ర రీతిలో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ విగ్ర‌హం

ఇంగ్లండ్‌లోని ఓ విలేజ్‌లో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) విగ్ర‌హాన్ని అభ్యంత‌ర‌క‌ర రీతిలో ఏర్పాటు చేశారు. ర‌ష్యా–ఉక్రెయిన్ వార్ నేప‌థ్యంలో ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా బెల్ ఎండ్ గ్రామంలో పుతిన్ (Vladimir Putin) విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. దానిపై బెల్లెండ్(స్టుపిడ్ ప‌ర్స‌న్) ఆఫ్ ది ఇయ‌ర్ అని రాసి ఉంచారు.

  • Written By:
  • Updated On - December 18, 2022 / 09:24 AM IST

ఇంగ్లండ్‌లోని ఓ విలేజ్‌లో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) విగ్ర‌హాన్ని అభ్యంత‌ర‌క‌ర రీతిలో ఏర్పాటు చేశారు. ర‌ష్యా–ఉక్రెయిన్ వార్ నేప‌థ్యంలో ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా బెల్ ఎండ్ గ్రామంలో పుతిన్ (Vladimir Putin) విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. దానిపై బెల్లెండ్(స్టుపిడ్ ప‌ర్స‌న్) ఆఫ్ ది ఇయ‌ర్ అని రాసి ఉంచారు. అయితే ఈ విగ్ర‌హంలో పుతిన్ త‌ల‌ను పురుషాంగం ఆకారంలో చిత్రీక‌రించడం గమనార్హం.

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌లోని ఒక గ్రామం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తలపై పురుషాంగం ఆకారం ఉన్నట్లు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఓ సంస్థ. ఈ విగ్రహం ఇంగ్లాండ్‌లోని బెల్ ఎండ్ గ్రామంలో స్థాపించారు. పుతిన్ విగ్రహం కింద “బెల్లెండ్ ఆఫ్ ది ఇయర్” అని రాసి ఉంచారు. పది నెలల పాటు ఉక్రెయిన్‌పై రష్యా దళాలు చేస్తున్న దాడికి నిరసనగా ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. దాన్ని డిసెంబ‌ర్ 15వ తేదీన బెల్ ఎండ్ గ్రామంలో ప్ర‌ద‌ర్శించారు. విగ్ర‌హం ప‌క్క‌నే కోడి గుడ్ల‌ను ఉంచారు. ఎందుకంటే కోడి గుడ్ల‌ను విగ్ర‌హం మీద విసిరేందుకు అందుబాటులో ఉంచిన‌ట్లు పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా నిర‌స‌నకారులు మాట్లాడుతూ.. బెల్లెండ్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు ఒక వేళ ఇవ్వాల్సి వ‌స్తే అది వ్లాదిమిర్ పుతిన్‌కే ఇవ్వాల‌ని వారు పేర్కొన్నారు. విశ్వ వ్యాప్తంగా బెల్లెండ్ అయిన వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే అది పుతిన్ మాత్ర‌మే అని పేర్కొన్నారు. విగ్రహానికి మంచి ఆదరణ లభించిందని, ప్రజలు ఇష్టపూర్వకంగా విగ్రహంపై గుడ్లు విసిరి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

Also Read: Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

అయితే ఈ విగ్ర‌హాన్ని అభ్యంత‌ర‌క‌ర రీతిలో పురుషాంగం ఆకారంలో ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌ శరణార్థులకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి విగ్రహలను విక్రయించాలని యోచిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఏడాది వ్యవధిలో ఉక్రెయిన్‌లో జరిగిన విధ్వంసాన్ని చూసిన తర్వాత తమ వంతు సాయం చేయాలని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు.