Orange Pigeon :140ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన పావురం..దాని ప్రత్యేకత ఏంటంటే..?

  • Written By:
  • Updated On - November 24, 2022 / 11:41 AM IST

అంతరించిపోయిందనుకున్న నారింజ రంగు జాతి పావురం…140ఏళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్షమైంది. ఇది అరుదైన పావురం. దీనిని బ్లాక్ నేప్డ్ పెసెంట్ పావరం అని పిలుస్తారు. ఈ పక్షి 1882లో మొదటిసారి కనిపించింది. 140 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నారింజ రంగు పావురం ఎందుకంత అరుదైంది. దాని ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం.

ఈ నారింజ కలర్ పావురం చివరిసారిగా 1882లో కనిపించింది. ఆ తర్వాత దీని జాడ లేకపోవడంతో ఈ జాతి పావురాలు అంతరించిపోయినట్లు అంతా భావించారు. కానీ 140ఏళ్ల తర్వాత ఇప్పుడు న్యూ గినియాలోని ఫెర్గూసన్ ద్వీపంలో మళ్లీ కనిపించింది. అడవిలో అమర్చిన కెమెరాలో ఈ పావురం కదలికలు రికార్డు అయ్యాయి. ఈ పావురం గినియా ద్వీపంలో తప్పా ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.

ఒక శతాబ్దానికి పైగా ఈ అరుదైన పావురం సైన్స్ ప్రపంచానికి దూరంగా ఉంది. అయితే 2019లో పాపువా న్యూ గినియాలో అంతరించిపోతున్న జీవులను కనుగొనాలన్న ఉద్దేశ్యంతో సెర్చింగ్ ప్రారంభించారు. అందులో భాగంగా అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాలో నారింజ కలర్ పావురంతోపాటు ఔవో అనే పక్షీ జాడా కూడా తెలిసింది. అంతరించిపోయినట్లుగా భావించిన చాలా పక్షలు, కోవిడ్ సమయంలో మళ్లీ వృద్ధి చెందాయని కార్నెల్ ల్యాబ్ ఆఫ్ ఆర్నిథాలజీకి చెందిన పరిశోధకుడు జోర్డాన్ తెలిపారు.