అమెరికాలోని మేరీల్యాండ్ లో పెను ప్రమాదం తప్పింది. మోంటోగోమెరీ కౌంటీలో ఆదివారం రాత్రి ఓ చిన్న విమానం కూలిపోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దెత్తున విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. మోంట్ గోమెరీలో దాదాపు 90వేల ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది. రోత్ బరీ డాక్టర్ అండ్ గోషేన్ రోడ్ దగ్గర ఓ చిన్న విమానం విద్యుత్ స్తంబాన్ని ఢీకొట్టిందని మోంట్ గోమోరీ కౌంటీ పోలీసులు తెలిపారు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు నిలిచిపోయిందన్నారు.
A small plane has crashed into power lines in the area of Rothbury Dr & Goshen Rd, taking out power to parts of the county.@mcfrs is on scene. PLEASE AVOID THE AREA, as there are still live wires. #MCPD #MCPNews
— Montgomery County Department of Police (@mcpnews) November 27, 2022
ప్రమాదకర స్థితిలో విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఘటనాస్థలానికి వెళ్లేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తుండటంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే విమానంలో ఎంత మంది ఉన్నరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ అందులో ఉన్నవారంతా సేఫ్ గానే ఉన్నట్లు సమాచారం.