Site icon HashtagU Telugu

11 People Burnt : ఘోర అగ్ని ప్రమాదం.. 11 మంది అగ్నికి ఆహుతి

11 People

11 People

11 People Burnt : ఓ షాపింగ్‌ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగి 11 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న రషీద్ మిన్హాస్ రోడ్‌లో ఉన్న నాలుగు అంతస్తుల షాపింగ్‌ మాల్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం తర్వాత సమీపంలోని ఆస్పత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. ఇప్పటివరకు 22 మందిని షాపింగ్ మాల్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ మాల్‌లో షాపింగ్ సెంటర్స్, కాల్‌ సెంటర్స్‌ ఉన్నాయి. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మాల్‌లో తగినన్ని ఎగ్జిట్ డోర్లు లేకపోవడంతో.. ప్రమాదం జరిగిన వెంటనే లోపల ఉన్నవారంతా బయటికొచ్చే ఛాన్స్ లేకుండాపోయింది. దీనివల్లే 11 మంది తీవ్రంగా అగ్నికి ఆహుతై చనిపోయారు.  గత వారమే కొంతమంది ప్రభుత్వ నిపుణుల టీమ్.. కరాచీలోని భవనాలను తనిఖీ చేసింది. 90 శాతం భవనాల నిర్మాణంలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘనే కనిపిస్తోందని ఆ టీమ్ నివేదిక ఇచ్చింది. ఈనేపథ్యంలో శనివారం ఉదయాన్నే కరాచీలోని షాపింగ్ మాల్‌లో చోటుచేసుకున్న ప్రమాదం భద్రతా లోపాలను ఎత్తి చూపిస్తోంది. సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మక్బూల్ బకర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పారు.గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి(11 People Burnt) తెలిపారు.