Site icon HashtagU Telugu

Pakistan: మతం మారనన్న అమ్మాయి.. కిడ్నాప్ చేసి నీచంగా!

22012023crimebrk12a 1

22012023crimebrk12a 1

Pakistan: మతం మారమని కొందరు యువకులు ఓ అమ్మాయి వెంట పడగా.. ఆమె ఎట్టి పరిస్థితుల్లో మతం మారబోనని స్పష్టం చేసింది. దాంతో కోపం పెంచుకున్న ఆ యువకులు ఆమెను కిడ్నాప్ చేసి, మూడు రోజుల పాటు తన మీద అత్యాచారం చేశారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే వారూ పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగినా అక్కడి అధికారులకు చీమ కుట్టినట్లైనా లేదు.

మన దాయాది దేశమైన పాకిస్థాన్ లో జరిగిన అతి దారుణమైన ఘటన ఇది. పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో హిందువులు ఎక్కువగా నిలసిస్తుంటారు. అయితే వారిని బలవంతంగా మతం మార్చుకోవాలని స్థానికంగా ఉండే ముస్లింలు బలవంతం చేస్తుంటారు. ఒకవేళ ముస్లింలుగా మారడానికి వాళ్లు ఒప్పుకోకపోతే, అమ్మాయిలు అయితే అత్యాచారం చేయడం, లేదంటే హత్య చేయడం చేస్తుంటారు.

తాజాగా సింధ్ ప్రావిన్స్ ఉమర్ కోట్ జిల్లాలోని సమరో పట్టణానికి చెందిన ఓ అమ్మాయిని మతం మార్చుకోవాలని కొంతమంది యువకులు వేధిస్తున్నారు. అయితే తాను మతం మార్చుకోనని సదరు యువతి తెగేసి చెప్పింది. దీంతో తమ మాట వినకుండా, మతం మారడానికి సిద్ధంగా లేనందు వల్ల ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి మూడు రోజుల పాటు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు.

తన మీద అత్యాచారం జరిగిందని సదరు మహిళ మిర్ పుర్ ఖాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే, అక్కడి అధికారులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదు. దీంతో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ ముందే నిరసనకు దిగింది. తన మీద ఇబ్రమీం మాంగ్రియో, పున్హో మాంగ్రియో, వారి అనుచరులు అత్యాచారానికి పాల్పడినట్లు ఆ అమ్మాయి చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా తనను కిడ్నాప్ చేసి మూడు రోజులు అత్యాచారం చేశారని, వాళ్ల నుండి ఎలాగోలా బయటపడ్డానని ఆ అమ్మాయి వివరించింది.