Site icon HashtagU Telugu

Rupert Murdoch: 92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకోనున్న రూపర్ట్ మర్డోక్

Rupert Murdoch

Resizeimagesize (1280 X 720) 11zon

మీడియా మొగల్ గా పేరుగాంచిన రూపర్ట్ మర్డోక్ (Rupert Murdoch) తన 92వ ఏట పెళ్లి చేసుకోబోతున్నాడు. బిలియనీర్ వ్యాపారవేత్త మాజీ పోలీసు కెప్టెన్ ఆన్ లెస్లీ స్మిత్ (66)తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్‌లో కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ముర్డోక్, లెస్లీ ఈ సంవత్సరం వేసవి చివరిలో వివాహం చేసుకోనున్నారు. ముర్డోక్ తన నాల్గవ భార్య జెర్రీ హాల్ నుండి గత సంవత్సరం విడిపోయాడు.

బిలియనీర్ మీడియా టైకూన్ రూపర్ట్ మర్డోక్ (92) గతేడాది తన నాలుగో భార్యతో విడిపోయారు. వేసవిలో వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ముర్డోక్ తన మొదటి ముగ్గురు భార్యల నుండి ఆరుగురు పిల్లలకు తండ్రి. అతను ప్రముఖ మీడియా వ్యాపారవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. రూపర్ట్ మర్డోక్ ఇంతకు ముందు కూడా నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడు. ముర్డోక్‌కి అతని మొదటి ముగ్గురు భార్యల నుండి ఆరుగురు పిల్లలు ఉన్నారు.

Also Read: Texas : టెక్సాస్ పాఠశాలలో కాల్పుల క‌ల‌క‌లం.. విద్యార్థి మృతి

ముర్డోక్ ఇలా అన్నాడు.. మేమిద్దరం మా జీవితంలోని రెండవ సగం కలిసి గడపడానికి చాలా ఎదురుచూస్తున్నామని అన్నారు. మర్డోక్ వ్యాపార సామ్రాజ్యంలో USలోని ఫాక్స్ న్యూస్, UKలోని టాబ్లాయిడ్ ది సన్ వంటి ప్రచురణ సంస్థలు ఉన్నాయి. లెస్లీని త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన రూపర్ట్‌.. ఇదే తన చివరి వివాహమని చెప్పారు. ఈ ఏడాది వేసవిలో తాము పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. మర్డోక్‌కు ఆరుగురు సంతానం ఉన్నారు.