Site icon HashtagU Telugu

Ethiopia : ఇథియోపియాలో ఘోరం.. నదిలో పడిన ట్రక్కు.. 71 మంది మృతి

Ethiopias Road Accident Sidama State

Ethiopia : ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు రోడ్డుపై నుంచి అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఇథియోపియా(Ethiopia)లోని సిదామా రాష్ట్రం బోనా జిల్లాలో ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు చోటుచేసుకున్న ఈ దారుణ ప్రమాదంలో 71 మంది ప్రయాణికులు చనిపోయారు. చనిపోయిన వారిలో 68 మంది పురుషులు, ముగ్గురు స్త్రీలు ఉన్నారు. గాయపడిన వారిని బోనా జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Also Read :Allu Arjun : అల్లు అర్జున్‌కు చుక్కెదురు.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

చనిపోయిన వారిలో కొందరు ఓ పెళ్లికి హాజరై.. ఇళ్లకు తిరిగి వెళ్తున్న వారు ఉన్నారని గుర్తించారు. సామర్థ్యానికి మించిన సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్తున్నందు వల్లే ట్రక్కు అదుపు తప్పిందని గుర్తించారు. గతంలో 2018 సంవత్సరంలోనూ ఇథియోపియాలో ఇదే తరహాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బస్సు.. లోయలోకి పడిపోయిన ఘటనలో దాదాపు 38 మంది చనిపోయారు. ఇథియోపియా పేద దేశం. అక్కడ సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేవు. రోడ్లు దారుణంగా ఉంటాయి. వాహనాల ఫిట్‌నెస్‌కు సంబంధించిన తనిఖీలు రెగ్యులర్‌గా జరగవు. అందువల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి.

Also Read :AAP : పూజారులకు నెలకు రూ.18వేలు : అరవింద్ కేజ్రీవాల్

ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ సహా నాలుగు విమానయాన కంపెనీలపై నైజీరియా పౌర విమానయాన శాఖ బ్యాన్ విధించింది. విమాన ప్రయాణికుల హక్కులను కాలరాస్తున్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ అనేది ఆఫ్రికాలోనే అతిపెద్ద విమానయాన సంస్థ. ప్రయాణికులకు సంబంధించి రీఫండ్ వ్యవహారాలను ఆయా విమానయాన కంపెనీలు వేగంగా ప్రాసెసింగ్ చేయడం లేదని దర్యాప్తు గుర్తించారు. ప్రయాణికుల హక్కుల ఉల్లంఘన జరగకుండా చూస్తామనే హామీ ఇచ్చే వరకు బ్యాన్‌ను తొలగించేది లేదని నైజీరియా పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.

Also Read :New Year First Week : హ్యాపీ న్యూ ఇయర్.. 2025 జనవరి 1 నుంచి జనవరి 7 వరకు రాశిఫలాలు