Site icon HashtagU Telugu

700 Killed : గాజాలోని ఆస్పత్రిపై ఇజ్రాయెల్ ఎటాక్.. 700 మంది మృతి

700 Killed

700 Killed

700 Killed : గాజాలో అమానుషం జరిగింది.  ఇజ్రాయెల్ సైన్యం గాజా సిటీలోని అల్-అహ్లీ ఆసుపత్రిపై బుధవారం అర్ధరాత్రి మిస్సైల్ ఎటాక్ చేసింది. ఈ దాడిలో దాదాపు 700 మందికిపైగా రోగులు, రోగుల బంధువులు, ఆస్పత్రి సిబ్బంది  చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మిస్సైల్ ఎటాక్ జరిగిన వెంటనే ఆస్పత్రి భవనం కూలిపోయినట్లు తెలుస్తోంది. ఐసీయూలో ఉన్న ఎంతో మంది పేషెంట్స్, ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో గాయాలపాలై హాస్పిటల్ లో చేరినవారు ఈ దాడిలో చనిపోయారు. ఉత్తర గాజాలోని ఆస్పత్రులను ఖాళీ చేసి.. రోగులను దక్షిణ గాజాకు తీసుకెళ్లాలని ఇజ్రాయెల్ ఇటీవల వార్నింగ్ ఇచ్చింది. అయినా పట్టించుకోకుండా ఆస్పత్రులను నిర్వహించడం వల్లే ఇజ్రాయెల్ ఈ దాడి చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.అయితే తాము గాజాలోని ఈ  హాస్పిటల్ పై దాడి చేయలేదని, బహుశా హమాసే ఈ దాడి చేసి ఉండొచ్చని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడి తీవ్ర యుద్ధ నేరమని హమాస్ వ్యాఖ్యానించింది. ఈ ఘటనతో(700 Killed)  ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ పై ఆగ్రహం పెల్లుబికింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ స్పందిస్తూ.. తీవ్ర యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇకనైనా మానవాళి ఏకం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ ఘటనను ఖండించారు. దీనిపై పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రతినిధి టెలిగ్రామ్ లో చేసిన ఒక పోస్ట్ లో.. అల్-అహ్లీ హాస్పిటల్ పై జరిగిన దాడిలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారని వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడిని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (MSF)తో సహా అనేక వైద్య సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఖండించాయి.  అల్-అహ్లీ ఆసుపత్రిపై జరిగిన దాడి ఎంత భయంకరమైందో మాటల్లో చెప్పలేమని  హ్యూమన్ రైట్స్ వాచ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గాజాలో కనీసం ఇలాంటి దురాగతాలనైనా ఆపాల్సిన బాధ్యత ప్రపంచ దేశాల నాయకులపై ఉందని అభిప్రాయపడింది.

Also Read: Ayurveda Tips For Kidney: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉత్తమ మార్గాలు ఇవే..!