Tsunami Warning : సునామీ హెచ్చరిక జారీ.. జపాన్‌లో తీవ్ర భూకంపం

Tsunami Warning : కొత్త సంవత్సరంలో మొదటిరోజే భూకంపంతో జపాన్ వణికిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Chile Earthquake

Chile Earthquake

Tsunami Warning : కొత్త సంవత్సరంలో మొదటి రోజే భూకంపంతో జపాన్ వణికిపోయింది. సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.  జపాన్‌ పశ్చిమ తీరంలోని ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ ప్రాంతాలలో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. సునామీ అలలు దాదాపు 5 మీటర్ల (15 అడుగులు) ఎత్తులో ఎగిసిపడుతూ బలమైన ప్రవాహంతో ఇషికావా ప్రిఫెక్చర్‌ ప్రాంతంలోని నోటో ద్వీపకల్ప తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.  1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తున్న అలలు ఇషికావా ప్రిఫెక్చర్‌ ప్రాంతంలోని వాజిమా సిటీ తీరాన్ని తాకొచ్చని అంచనా వేసింది.

We’re now on WhatsApp. Click to Join.

సునామీ ప్రభావంతో తమ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లలో ఏవైనా ఇబ్బందులు తలెత్తాయా అనే దానిపై Hokuriku ఎలక్ట్రిక్ పవర్  కంపెనీ నిపుణుల టీమ్ పరిశీలన జరుపుతోంది. మరోవైపు జపాన్‌లోని టోక్యో, కాంటో ప్రాంతాల్లో భూకంపం కూడా సంభవించిందని తెలుస్తోంది. 2023 సంవత్సరంలోనూ జపాన్‌లో శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. డిసెంబరులో కురిల్ దీవుల సమీపంలో 6.5, 5.0 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. మే 5న  జపాన్ యొక్క పశ్చిమ ప్రిఫెక్చర్ ఇషికావాలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో చాలా మంది గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోయాయి.

Also Read: Sharmilas Son Wedding : వైఎస్ షర్మిల కొడుకు పెళ్లిపై కీలక అప్డేట్

మరోవైపు  భారత్ పొరుగున ఉన్న నేపాల్‌లోనూ ఆదివారం అర్ధరాత్రి తర్వాత భూకంపం(Tsunami Warning) సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. అంతకుముందు నవంబర్ 6న కూడా నేపాల్‌లో రెండు భూకంపాలు సంభవించాయి. వీటి ప్రభావంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల ప్రజలు కూడా ప్రకంపనలను ఫీలయ్యారు. నవంబర్ 3న సంభవించిన భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దీనివల్ల పశ్చిమ నేపాల్‌లోని జాజర్‌కోట్, రుకుమ్ వెస్ట్ జిల్లాలలో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. దీని కారణంగా 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు.

  Last Updated: 01 Jan 2024, 01:54 PM IST