రష్యా మాస్కో డొనెట్స్క్‌పై ఉక్రెయిన్ క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్ క్షిపణి దాడిలో 63 మంది సైనికులు (63 Russian Soldiers) మరణించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన క్షిపణి దాడిలో సుమారు 400 మంది రష్యన్ సైనికులు మరణించినట్లు ప్రకటించింది. గత వారం రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి.
రష్యా సైన్యం ఆక్రమించిన తూర్పు ఉక్రెయిన్‌లోని వృత్తి విద్యా పాఠశాలపై ఉక్రెయిన్ దాడి చేసింది. నూతన సంవత్సరం రోజు తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఉక్రెయిన్ నాలుగు రాకెట్లతో దాడి చేసిందని, అందులో తమ సైనికులు మరణించారని టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ప్రకటనలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం (జనవరి 1) ఉక్రెయిన్ సైన్యం నూతన సంవత్సర పండుగ సందర్భంగా మాస్కో డొనెట్స్క్‌పై కనీసం 25 రాకెట్లను ప్రయోగించింది.
Also Read: PM Modi: పాత నోట్లను రద్దు చేసి మూల్యం చెల్లించుకున్న దేశాలు ఇవే..?
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది సేపటి తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో రష్యా సైనికులు బస చేసిన స్థావరం పక్కనే భారీ మందుగుండు నిల్వ కేంద్రం ఉండటంతో రాకెట్ దాడివల్ల అన్ని సైనిక పరికరాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య పోరు మరింత ముదిరింది. అంతకుముందు.. రష్యా గత వారం ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసింది. రష్యా దాడిలో దాదాపు నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.