Site icon HashtagU Telugu

Explosion: పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో బాంబు పేలుడు.. ఆరుగురు దుర్మరణం, పలువురికి గాయాలు

China Explosion

Bomb blast

Explosion: పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని కోట్ అడ్డూ (Punjab’s Kot Addu) జిల్లా దయా దిన్ పనాహ్ ప్రాంతంలో గురువారం ఓ ఇంట్లో జరిగిన బాంబు పేలుడు (Explosion)లో కనీసం ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనను ధృవీకరిస్తూ ముజఫర్‌ఘర్ జిల్లా పోలీసు అధికారి (DPO) సయ్యద్ హస్నైన్ హైదర్ మాట్లాడుతూ.. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారని, వారు జంక్‌లను విక్రయించేవారని తెలిపారు. కుటుంబ సభ్యులు చెత్తను తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ 1122 ప్రతినిధి మాట్లాడుతూ.. మృతుల్లో ఇద్దరు మహిళలు హసీనా మాయి (40), షానో మాయి (28) కూడా ఉన్నారని తెలిపారు. ఇద్దరు పురుషులు బిలాల్ (38), ఇక్బాల్ (30), ఇద్దరు పిల్లలు, వారిలో ఒకరికి రెండేళ్లు, మిగిలిన క్షతగాత్రులను, మృతదేహాలను కోట్ అడ్డూ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.

Also Read: Aircraft Crashes: కుప్పకూలిన మరో ఎయిర్‌క్రాఫ్ట్.. ఇద్దరు పైలట్లు సురక్షితం

ముజఫర్‌గఢ్ జిల్లా పోలీసు అధికారి (DPO) హైదర్ పేలుడు పరిస్థితి గురించి తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇది కాకుండా పంజాబ్ ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ ప్రాణ, ఆస్తి నష్టంపై విచారం వ్యక్తం చేశారు. పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్ నుండి సంఘటనపై నివేదిక కోరారు.

గదిలో బాంబు పేలడంతో 6 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. అనంతరం రెస్క్యూ టీమ్‌ సహాయక చర్యలు ప్రారంభించింది. ఈ పేలుడు ఘటనపై సమాచారం అందుకున్న పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) ఉస్మాన్ అన్వర్ డేరా ఘాజీ ఖాన్ ప్రాంతీయ పోలీసు అధికారి నుంచి నివేదిక కోరారు. ఈ విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ముజఫర్‌గఢ్ జిల్లా పోలీసు అధికారిని కూడా ఆయన ఆదేశించారు.