సౌత్ సూడాన్ (South Sudan) లోని జోంగ్లీ రాష్ట్రంలో న్యుర్, ముర్లే వర్గాల మధ్య జాతి పోరు నాలుగు రోజులు (4 Days Fighting) జరిగింది. ఆయుధాలతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో 56 మంది మరణించ (56 Killed)గా వారిలో 51 మంది న్యుర్ వర్గం వారేనని స్థానిక అధికారి వెల్లడించారు. డిసెంబర్ 24న ముర్లే వర్గం వారిపై సాయుధులైన న్యుర్ యువకులు దాడి చేయడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయని అధికారి తెలిపారు.
దక్షిణ సూడాన్‌లోని తూర్పు జోంగ్లీ రాష్ట్రంలో నాలుగు రోజులుగా జరిగిన పోరులో న్యూయర్ యువకులు మరో జాతిపై దాడి చేయడంతో జరిగిన ఘర్షణల్లో 56 మంది చనిపోయారు. ఎక్కువగా న్యుయర్స్ ప్రజలు మరణించారని స్థానిక అధికారి మంగళవారం తెలిపారు.
Also Read: దక్షిణ కొరియాలో మెదడును తినే ఇన్ఫెక్షన్..ఒకరు మృతి
2011లో సూడాన్ నుండి స్వాతంత్య్రం పొందిన దక్షిణ సూడాన్ ప్రాంతం, పశువులు, భూమి కోసం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన జాతి పోరుల 56 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రేటర్ పిబోర్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్‌లోని ప్రభుత్వ అధికారి అబ్రహం కీలాంగ్ మాట్లాడుతూ.. డిసెంబర్ 24న గుమురుక్ కౌంటీ, లికుయాంగోల్ కౌంటీలోని ముర్లే కమ్యూనిటీపై సాయుధ న్యుయర్ యువకులు దాడి చేయడం ప్రారంభించారు.
కమ్యూనిటీలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని కీలాంగ్ అన్నారు. మరణించిన వారిలో 51 మంది న్యూర్ వర్గం వారు, ఐదుగురు ముర్లే వ్యక్తులు మరణించారని ఆయన చెప్పారు. గత వారం ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ (UNMISS) న్యూర్ యువకులు ఆయుధాలను కూడా సమీకరించినట్లు తెలిపింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ ఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టింది.