దుబాయ్ (Dubai)లో దారుణం చోటుచేసుకుంది. ఓ భవనంలోని తొమ్మిదో అంతస్తు నుంచి ఐదేళ్ల భారతీయ బాలిక (Indian Girl) ప్రమాదవశాత్తు జారిపడి మరణించింది. ఆడుకుంటూ కిటికీలోంచి జారి పడిందని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాలిక (Indian Girl) మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.దుబాయ్ లో ఈ ఏడాది ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది.
గత నెలలో ఆసియా సంతతికి చెందిన మూడేళ్ల చిన్నారి అల్ తౌన్ ప్రాంతంలోని భవనం 14వ అంతస్తు నుంచి పడి మృతి చెందగా.. ఫిబ్రవరిలో షార్జాలోని కింగ్ ఫైసల్ స్ట్రీట్‌లో ఉన్న రెసిడెన్షియల్ టవర్ 32వ అంతస్తు నుండి కిందపడి 10 ఏళ్ల బాలుడు మరణించాడు. డిసెంబర్ 10న దుబాయ్‌లోని దీరా జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు ఓ నివేదిక పేర్కొంది. తొమ్మిదో అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లోని అతి చిన్న కిటికీ నుంచి చిన్నారి జారిపడి మరణించింది. UAEలో అధికారిక డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తర్వాత కుటుంబం బాలిక మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావాలని భావిస్తున్నారు. బాధితురాలి కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియలేదు.