Site icon HashtagU Telugu

Shooting At Protesters: ఇరాన్ లో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి

Shooting In Philadelphia

Open Fire

ఇరాన్‌లోని హిజాబ్‌ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రభుత్వం, సైన్యం అణచివేస్తున్నసంగతి తెలిసిందే. తాజాగా ఖుజెస్థాన్‌ ప్రావిన్స్‌లోని లేజ్‌ నగరంలో జరుగుతున్న హిజాబ్‌ వ్యతిరేక ర్యాలీపై గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సెంట్రల్‌ మార్కెట్‌ ప్రాంతంలో 2 మోటారు సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 10 మంది గాయపడ్డారు.

ఇరాన్ నైరుతి నగరమైన లేజ్‌ బీచ్ మార్కెట్‌లో ముష్కరులు కాల్పులు జరపడంతోఐదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లో పలువురు పౌరులతో పాటు భద్రతలో ఉన్న సైనికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ, ఓ బాలిక మృతి చెందినట్లు అక్కడి వార్తా సంస్థ వెల్లడించింది. దుండగులు ఎందుకు కాల్పులు జరిపారనేది ఇంకా తెలియరాలేదు.

ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు సహా మరో పది మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఒక బాలిక, ఒక మహిళ ఉన్నారని ఖుజెస్తాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ వలీవుల్లా హయాతి తెలిపారు. ఈ ఘటనకు ముందు ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు డజన్ల కొద్దీ నిరసనకారుల బృందం బుధవారం అర్థరాత్రి లేజ్‌ లోని వివిధ ప్రాంతాలలో గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆపై పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఆ తర్వాత వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ను పోలీసులు కూడా విడుదల చేశారు.