41 year old cake: వేలానికి 4 దశాబ్దాల కేక్.. ఎక్కడంటే..?

ఇంట్లో జరిగే ఏ శుభకార్యంలోనైనా మనకు గుర్తొచ్చేది, కనిపించేది కేక్ కటింగ్. కేక్ నిలువచేస్తే గంటల్లోనే పాడైపోతుంది. అలాంటిది ఇంగ్లండ్‌కు చెందిన డోరే అండ్‌ రీస్‌ ఆక్షన్స్‌ అనే సంస్థ ఏకంగా 41 ఏండ్ల క్రితం నాటి కేక్ ను వేలం వేసేందుకు సిద్ధమైంది.

  • Written By:
  • Updated On - October 19, 2022 / 07:36 PM IST

ఇంట్లో జరిగే ఏ శుభకార్యంలోనైనా మనకు గుర్తొచ్చేది, కనిపించేది కేక్ కటింగ్. కేక్ నిలువచేస్తే గంటల్లోనే పాడైపోతుంది. అలాంటిది ఇంగ్లండ్‌కు చెందిన డోరే అండ్‌ రీస్‌ ఆక్షన్స్‌ అనే సంస్థ ఏకంగా 41 ఏండ్ల క్రితం నాటి కేక్ ను వేలం వేసేందుకు సిద్ధమైంది. కింగ్‌ చార్లెస్‌-ప్రిన్సెస్‌ డయానాల పెండ్లి(1981)కి 3000 వేల మందికిపైగా అతిధులు హాజరయ్యారు. అయితే ఈ పెండ్లికి హాజరైన మూడు వేల మందిలో నైగెల్‌ రికెట్స్‌ అనే వ్యక్తి కూడా ఒకరు. అందరికీ ఇచ్చినట్టే ఆ పెండ్లిలో నైగెల్‌కు కూడా ఓ కేక్ ఇచ్చారు. నైగెల్ ఆ కేక్ ను ఇంటికి తీసుకెళ్లి కొంతభాగాన్ని భద్రపర్చాడు. 2021లో ఆయన మరణించారు.

ఆయన భద్రపర్చిన కేక్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆ కేకులోని ఒక ముక్కను ఇప్పుడు వేలం వేయబోతున్నారు. వేలంలో ఆ కేకు ముక్క ప్రారంభ ధరను మన కరెన్సీలో సుమారు రూ.27 వేలుగా నిర్ణయించారు. నైగెల్‌ రికెట్స్‌ బతికి ఉండగా కూడా ఈ కేకులోని ఒక ముక్కను వేలం వేశారు. 2014లో జరిగిన వేలంలో ఆ కేకు ముక్క మన కరెన్సీలో రూ.1.27 లక్షలు పలికింది. మరి ఇప్పుడు ఈ కేక్ ముక్క ఎంతకు సొంతం చేసుకుంటారో చూద్దాం.