41 People Burned Alive: ఘోర ప్రమాదం జరిగింది. అందరూ షాక్‌కు గురయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న 41 మంది సజీవ దహనం అయ్యారు. ఈ బాధాకర ప్రమాద ఘటన వివరాలివీ..
Also Read :First GBS Death : తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. ఇవి తెలుసుకోండి
డీజిల్ లీక్.. ఆ వెంటనే మంటలు
అతి వేగం ఎంతోమంది నిండు ప్రాణాలు తీసింది. దక్షిణ మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అతివేగంగా దూసుకెళ్లి ట్రక్కును ఢీకొట్టింది. శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో బస్సులోని 41 మంది సజీవ దహనం(41 People Burned Alive) అయ్యారు. వారి శరీరాలు గుర్తుపట్టలేనంత దారుణంగా కాలిపోయాయి. దీంతో బాధిత కుటుంబాల వేదన చెప్పలేని విధంగా ఉంది. చనిపోయిన వారిలో 39 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు బలంగా ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న డీజిల్ ట్యాంకు నుంచి డీజిల్ లీకేజీ జరిగింది. ఈక్రమంలో డీజిల్ ప్రభావంతో మంటలు వేగంగా బస్సు, ట్రక్కులను అలుముకున్నాయి.
Also Read :TS RTC Buses : ఆర్టీసీ బస్సుల 25,609 ట్రాఫిక్ ఉల్లంఘనలు.. రూ.1.84 కోట్ల ఫైన్‌లు
అందరి ఫోన్లూ కాలిపోవడంతో..
జనం లేని నిర్మానుష్య ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే కనీసం అగ్నిమాపక విభాగానికి సమాచారాన్ని అందించే వీలు లేకుండా పోయింది. బస్సులోని మొత్తం 48 మంది కూడా మంటల వలయంలోనే ఉండటంతో, ఎవరూ సహాయక అంబులెన్సులకు కాల్ చేయలేకపోయారు. అంతేకాదు ఈ ఘటనలో బస్సులో ఉన్న అందరు ప్రయాణికుల ఫోన్లు కాలిపోయాయి. దీంతో వారు ఎవరితో కమ్యూనికేషన్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రమాదానికి దారితీసిన నిర్దిష్టమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారి డెడ్‌బాడీలకు పోస్టుమార్టంలు జరుగుతున్నాయి. ఆయా ఆస్పత్రుల వద్ద బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. వాళ్లు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.