Saudi Arabia: సౌదీ అరేబియాలో వేసవి తాపం విపరీతంగా కనిపిస్తుంది. అక్కడ వేడికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. హజ్ తీర్థయాత్రలో ఉన్న జోర్డాన్ యాత్రికులు హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది మరణించారు. ఈ విషయాన్నీ జోర్డాన్ అధికారులు దృవీకరించారు. వడదెబ్బ కారణంగా మరణించిన జోర్డాన్ యాత్రికులను మక్కాలో ఖననం చేయడానికి అధికారులు విధానాలను అనుసరిస్తున్నారు.
సోమవారం సౌదీ అధికారులు యాత్రికులకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. మతపరమైన ఆచారాలను సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇస్లాం పవిత్ర నగరంలో సోమవారం 51.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇతర పవిత్ర ప్రదేశాలలో 48 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరం హజ్‌లో 1.8 మిలియన్ల మంది యాత్రికులు పాల్గొన్నారు, ఇటీవలి సంవత్సరాలలో రద్దీ కారణంగా వందలాది మంది మరణించిన అనేక విషాదాలు చోటు చేసుకున్నాయి. అయితే యాత్రికుల రద్దీని బట్టి అక్కడ ప్రభుత్వం జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ యాత్రికులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
Also Read: Pawan Kalyan : చంద్రబాబును సాయం కోరిన పవన్ కళ్యాణ్