థాయ్‌లాండ్‌లో కాల్పుల (Thailand Shooting) ఘటనలో నలుగురు మృతి చెందారు. స్థానిక మీడియా ప్రకారం.. దక్షిణ థాయ్‌లాండ్‌లోని సూరత్ థాని ప్రావిన్స్‌లోని ఖిరి రాత్ నిఖోమ్ జిల్లాలో శనివారం సాయంత్రం కాల్పులు జరిగాయి. ప్రస్తుతం అనుమానిత దుండగుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణంగా 600 కిమీ (370 మైళ్లు) దూరంలో సూరత్ థాని ప్రావిన్స్‌లోని ఖేరీ రాత్ నిఖోమ్ జిల్లాలో సాయంత్రం 5 గంటలకు కాల్పులు జరిగినట్లు న్యూ స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. బ్యాంకాక్‌లో జరిగిన సంఘటనతో సహా గత 12 నెలల్లో తరచూ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి.
థాయ్‌లాండ్‌లో ప్రజలు తుపాకులు కలిగి ఉండటం సాధారణం. గత కొన్ని నెలలుగా దేశంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో ఓ మాజీ పోలీసు 24 మంది చిన్నారులతో సహా 36 మందిని కాల్చి చంపాడు. ఈ ఘటన మొత్తం థాయ్‌లాండ్‌ను కుదిపేసింది. గత నెలలో పెట్చబురి ప్రావిన్స్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు న్యూ స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. కాగా గతకొన్ని నెలలుగా థాయ్‌లాండ్‌లో కాల్పుల ఘటనలు అధికమవుతున్నాయి.