Site icon HashtagU Telugu

4 Indian students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం

Mexico Bus Crash

Road accident

క్రిమియాలోని అలుష్టాలో గురువారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు (4 Indian students Died) మరణించారు. నలుగురు భారతీయ విద్యార్థులు అక్కడే ఉండి మెడిసిన్ చదువుతున్నారు. 4 మంది వైద్య విద్యార్థులలో 2 విద్యార్థులు మూడవ సంవత్సరం, మిగిలిన 2 విద్యార్థులు నాల్గవ సంవత్సరం చదువుతున్నారు. సమాచారం ప్రకారం.. నలుగురు విద్యార్థులు రెనాల్ట్ లోగాన్ కారులో సింఫెరోపోల్ వైపు వెళ్తున్నారు. అయితే అకస్మాత్తుగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మరణించారు.

Also Read: Hindu Woman Killed: పాకిస్థాన్‌లో హిందూ మహిళ దారుణ హత్య.. తలను నరికిన దుండగులు

నలుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందిన కేసును పోలీసులు విచారిస్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి సమాచారం ఇచ్చింది. నలుగురు విద్యార్థులు రెనాల్ట్ లోగాన్ కారులో క్రిమియాలోని సెర్గీవ్ సెన్స్కీ స్ట్రీట్ నుంచి సెయింట్ సిమ్ ఫెరొపోల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.