Site icon HashtagU Telugu

Nepal Car Accident: నేపాల్‌లో నలుగురు భారతీయుల దుర్మరణం.. కారు లోయలో పడడంతో ప్రమాదం

Mexico Bus Crash

Road accident

నేపాల్‌ (Nepal)లోని బాగ్‌మతి ప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతంలో కారు (Car) లోయలో పడడంతో నలుగురు భారతీయులు మరణించారు. అక్కడ మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నివేదికల ప్రకారం.. మంగళవారం అర్థరాత్రి ఐదుగురు భారతీయులు ప్రయాణిస్తున్న కారు బాగ్మతి ప్రావిన్స్‌లోని సింధులి జిల్లాలో అదుపు తప్పి రోడ్డు నుండి 500 మీటర్ల దూరంలో పడిపోయినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులను ఇంకా గుర్తించలేదు. మృతిచెందిన నలుగురు పురుషులేనని, వారు ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

బీహార్ రిజిస్ట్రేషన్ నంబర్ గల కారు ఖాట్మండుకు వెళ్తుండగా ప్రమాదానికి గురై ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని జిల్లా పోలీసు కార్యాలయానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్ కుమార్ సిల్వాల్ చెప్పినట్లు ‘ఖాట్మండు పోస్ట్’ వార్తాపత్రిక పేర్కొంది. గాయపడిన ఓ ప్రయాణికుడిని సింధులి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సిల్వాల్ తెలిపారు. నివేదికల ప్రకారం.. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Also Read: Rahul Gandhi : రాహుల్ గాంధీపై పరువు నష్టం ఫిర్యాదు. సావర్కర్ మనవడు పుణెలో పరువు నష్టం కేసు..

బీహార్‌కు చెందిన కారు ఖాట్మండుకు వెళ్తోందని ఖాట్మండు పోలీసు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సిల్వాల్ తెలిపారు. కారు బ్యాలెన్స్ తప్పి కాలువలో పడిపోయినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే సమయంలో ఒకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. క్లిష్ట భౌగోళిక ప్రాంతం కారణంగా ప్రమాద స్థలం నుండి మృతదేహాలను తొలగించడం సాధ్యం కాలేదు. “ప్రమాద స్థలానికి చేరుకోవడానికి గంటకు పైగా సమయం పడుతుంది. కాబట్టి మృతదేహాలను బయటకు తీయడం కష్టమవుతుంది” అని సిల్వాల్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. మృతదేహాలను వెలికితీసేందుకు నేపాల్ ఆర్మీ సహాయం కోరామని, ఘటనా స్థలానికి బృందం వెళుతోందని చెప్పారు.

Exit mobile version