UK : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. వారానికి 4 రోజులు డ్యూటీ, 3 రోజులు సెలవు.. జీతం మాత్రం!!

  • Written By:
  • Publish Date - October 29, 2022 / 07:23 AM IST

ఉద్యోగుల బాగు కోరుకునే కంపెనీ…ఎప్పటికీ అభివ్రుద్ధిలోనే ఉంటుంది. ఉద్యోగులు బాగుంటేనే కదా..కంపెనీ బాగుండేది. అందుకే ఈ మధ్యకాలంలో చాలా కంపెనీల ఉద్యోగుల శ్రేయస్సుపై ద్రుష్టిసారించాయి. పని విషయంలో ఎక్కువగా ఒత్తిడికి గురిచేయకుండా…వారికి కావాల్సిన సదుపాయాలన్నింటినీ కల్పిస్తున్నాయి. అయితే లండన్ కు చెందిన ఓ ఇంధన కంపెనీ…తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కేవలం 4రోజులు మాత్రమే పనిదినాలను కల్పించింది. మిగతా మూడు రోజులు సెలవు ప్రకటించింది. జీతం కూడా పూర్తిగా అందిస్తుంది. కంపెనీ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కంపెనీ ఇప్పుడే దీనిని ట్రయల్లో ప్రారంభించింది. ఈ ట్రయల్ మార్చి 2023 వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.

నాలుగు రోజులు డ్యూటీ అనేది అక్టోబర్ లో ప్రారంభమైనట్లు ఇంధన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ కింగ్ తెలిపారు. నాలుగు రోజుల పనివారంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందుతాయని తెలిపారు. ఈ ఇంధన కంపెనీ ప్లైమౌత్ బ్రిటన్ లో ఉంది. ఇది మార్కెటింగ్ సంస్థ. నాలుగు రోజుల పని దినాల్లో ఉద్యోగులు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తారు. అయితే కొంచెం పనిభారం ఎక్కుగానే ఉన్నప్పటికీ. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో మనోధైర్యం పెరిగిందని ఆయన తెలిపారు.

ఈ కంపెనీ ప్రస్తుతం పోర్ట్ కల్లిస్ లీగల్స్ తో కలిసి పనిచేస్తోంది. పోర్ట్ కల్లిస్ లీగల్స్ ఇప్పటికే నాలుగు రోజులు పనిదినాలనే భావనపై పనిచేస్తోంది. ట్రెవర్ వర్త్, పోర్ట్ కల్లిస్ లీగల్స్ 2019లోనే వారంలో నాలుగు రోజులు పనిదినాలనే కాన్సెప్ట్ ను ప్రారంభించారు. ఈ కంపెనీ ఎఫెక్ట్ తో బ్రిటన్ లోని చాలా కంపెనీలు వారానికి నాలుగు రోజులు పనిదినాలను స్వీకరించాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఏఈలోనూ నాలుగు రోజుల షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. న్యూజిలాండ్ , అమెరికాలో కూడా కొన్ని కంపెనీలు 4రోజుల వర్కింగ్ డేను ప్రారంభించాయి. ఇప్పటికే చాలా కంపెనీలు దీనిని కొనసాగిస్తున్నాయి.