Earthquake: మంగళవారం తెల్లవారుజామున భారత్‌కు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప కేంద్రం ఫైజాబాద్. ఇక్కడ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం ఉదయం 120 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 116 కిలోమీటర్ల దూరంలో ఉంది. NCS ప్రకారం.. ఈ భూకంపం భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3.23 గంటలకు సంభవించింది.
భూకంపాలు ఎందుకు వస్తాయి..?
భూమి లోపల ఆకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు.. బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది. భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం, అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది.
Also Read: Space Experiments: అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయి.. 276 రోజుల తర్వాత భూమిపైకి అంతరిక్ష నౌక..
5 కంటే తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు సాధారణంగా తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు నష్టం జరగవచ్చు. 2011లో జపాన్ తీరంలో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఇక్కడ సునామీ అలలు ఎగిసిపడడంతో మరింత విధ్వంసం నెలకొంది. ఈ భూకంపంలో దాదాపు 20 వేల మంది చనిపోయారు. అంతకుముందు 2006లో ఇండోనేషియాలో 9 తీవ్రతతో భూకంపం వచ్చి 5,700 మందికి పైగా మరణించారు.
ఇప్పటివరకు భారతదేశంలో 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు నాలుగు సార్లు సంభవించాయి. మొదటిది 1897లో షిల్లాంగ్‌లో, రెండవది 1905లో కాంగ్రాలో, మూడవది 1934లో బీహార్-నేపాల్‌లో, నాల్గవది 1950లో అస్సాం-టిబెట్‌లో. వీటిలో వేలాది మంది చనిపోయారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నివేదిక ప్రకారం.. భారతదేశంలో 59 శాతం భూకంపం పరంగా అత్యంత సున్నితమైనదిగా పరిగణించబడుతుంది. అంటే 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు ఎప్పుడైనా సంభవించవచ్చు.