Site icon HashtagU Telugu

China: చైనాలో అగ్ని ప్రమాదాలు.. 32 మంది మృతి

China

Resizeimagesize (1280 X 720) 11zon

చైనా (China)లోని ఓ ఆస్పత్రి, ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ రెండు అగ్ని ప్రమాదాల్లో కనీసం 32 మంది మరణించారు. ఈ విషయాన్ని చైనా మీడియా వెల్లడించింది. చైనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బీజింగ్‌లోని ఫెంగ్‌టై జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం 12.57 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఆసుపత్రి ప్రవేశ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. బీజింగ్‌లోని ఫెంగ్‌టై జిల్లాలోని ఆసుపత్రి అడ్మిషన్ భవనంలో మంగళవారం మంటలు చెలరేగాయి. 21 మంది మరణించారని చైనా డైలీ నివేదించింది.

71 మందిని ఆసుపత్రి నుంచి తరలించారు

మధ్యాహ్నం 1.33 గంటలకు మంటలను ఆర్పివేశామని, రెస్క్యూ ఆపరేషన్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగిందని చైనా అధికారులు చెప్పారు. మొత్తం 71 మంది రోగులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రమాద కారణాలను అన్వేషిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు నివేదిక పేర్కొంది.

Also Read: Air India Flight: ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. 180 మంది ప్రయాణికులు సేఫ్..!

చైనాలోని ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

చైనాలోని తూర్పు జెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని జిన్‌హువా నగరంలోని వుయి కౌంటీలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వం మంగళవారం సమాచారం అందించింది. సోమవారం తెల్లవారుజామున 02.04 గంటలకు మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎమర్జెన్సీ కాల్ అందడంతో ఫైర్ ఇంజన్లు, పోలీసు అధికారులు, అత్యవసర వైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించామని, 11 మృతదేహాలను కనుగొన్నామని చైనా డైలీ పేర్కొంది. ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతున్నారు.