Nobel Prize : ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలు ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చింది. 2024 సంవత్సరానికిగానూ ముగ్గురు ఆర్థిక వేత్తలకు సంయుక్తంగా నోబెల్ బహుమతిని ప్రకటించారు. సంస్థాగత వ్యవస్థలు – వాటి పురోగతి అనే అంశంపై అధ్యయనం చేసినందుకుగానూ అమెరికాకు చెందిన డారన్ ఏస్ మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్, రాబిన్సన్‌లకు నోబెల్ ప్రైజ్‌ను అనౌన్స్ చేశారు. ఈవిషయాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆర్థిక శాస్త్రంలో అందించే నోబెల్ ప్రైజ్‌ను ‘స్వెరైజ్స్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్’ అని స్వీడిష్ భాషలో పిలుస్తారు. విఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట నోబెల్ (Nobel Prize) బహుమతులను ఏటా అన్ని రంగాల నిష్ణాతులకు అందిస్తుంటారు. ఈ ప్రైజ్‌ను అందించడంతో పాటు దాదాపు రూ.10 కోట్ల నగదు పారితోషికాన్ని కూడా అందజేస్తారు. డారన్ ఏస్ మొగ్లు, సైమన్ జాన్సన్‌లు ప్రస్తుతం అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్థిక శాస్త్రంలో పరిశోధనలు అందిస్తున్నారు. ఇక జేమ్స్ రాబిన్సస్ చికాగో యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నారు.
Also Read :Twins Capital : ఈ పట్టణం.. కవలల ప్రపంచ రాజధాని.. ఎందుకు ?
‘‘నేటి ప్రపంచంలో ఆదాయ అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్. ఈ తరుణంలో సామాజిక వ్యవస్థల ప్రాధాన్యతపై డారన్ ఏస్ మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్, రాబిన్సన్‌లు సమగ్రమైన పరిశోధన చేశారు. ఆదాయ అంతరాలకు గల కారణాలను తెలుసుకునే దిశగా వీరి స్టడీ కొనసాగింది’’ అని ఆర్థిక శాస్త్ర నోబెల్ ప్రైజ్ ఎంపిక కమిటీ సారథి జాకబ్ స్వెన్సన్ వెల్లడించారు. ‘‘చట్టాలు సరిగ్గా లేని కొన్ని దేశాల్లో వ్యవస్థలు విఫలమయ్యాయి. వాటిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఫలితంగా అక్కడి ప్రజలకు ఆదాయ వనరులు లభించడం లేదు. అలాంటి చోట్ల సామాజిక మార్పు కోసం అవకాశాలు లభించడం లేదు. ఆ ముగ్గురు ఆర్థికవేత్తల అధ్యయనంలో ఇదే విషయాన్ని గుర్తించారు’’ అని ఆయన చెప్పారు. అధునాతన టెక్నాలజీతో ఉద్యోగాల కల్పన ఎలా పెంచాలి ? ప్రజల ఆదాయాల ఆర్జనను ఎలా మెరుగుపర్చాలి ? అనే అంశాలపైనా ప్రస్తుతం ఆర్థికవేత్త ఏస్ మొగ్లు, జాన్సన్‌లు రీసెర్ఛ్ చేస్తున్నారు. గత సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్‌ను హార్వర్ యూనివర్సిటీ పరిశోధకుడు క్లౌడియా గోల్డిన్ గెల్చుకున్నారు. ‘‘వేతన మార్కెట్ – కార్మిక మార్కెట్ – స్త్రీ, పురుషుల అసమానతలు’’ అనే అంశంపై రీసెర్చ్‌కుగానూ అప్పట్లో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు.