Operation Ajay: యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇజ్రాయెల్‌లో వరుస దాడులతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పిల్లలు, మహిళలు, వృద్ధులపై హమాస్ అమానవీయంగా దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ ఎదురుదాడి గాజాలో ప్రాణనష్టానికి కారణమవుతూనే ఉంది. తమ ప్రజలను బందీలుగా పట్టుకున్న హమాస్ గ్రూపు వారిని సురక్షితంగా అప్పగించే వరకు నీరు, విద్యుత్, ఇంధనం సరఫరా ఉండదని ఇజ్రాయెల్ ఖరాఖండిగా చెప్పింది.
ఈ ఉద్రిక్త వాతావరణంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా రక్షించి భారత్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి “ఆపరేషన్ అజయ్” అనే పథకాన్ని ప్రకటించి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. 13వ తేదీన భారత రాజధాని ఢిల్లీకి 212 మంది భారతీయులను ఇజ్రాయెల్ నుండి రక్షించారు. వారికీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వయంగా స్వాగతం పలికారు. ఆపరేషన్ అజయ్‌ను మరింత ముమ్మరం చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం నాల్గవ రెస్క్యూ ఫ్లైట్ ద్వారా 274 మంది భారతీయులను ఇజ్రాయెల్ నుండి రక్షించారు. ఆపరేషన్ అజయ్ ద్వారా ఇప్పటి వరకు 918 మంది భారతీయులను ఇజ్రాయెల్ నుంచి రక్షించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.
Also Read: Hi Nanna : నాని, మృణాల్ ‘హాయ్ నాన్న’ టీజర్ చూశారా? నాన్న సెంటిమెంట్ తో పాటు లవ్ ఎమోషన్స్ కూడా..