బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర పంచగఢ్ జిల్లాలో ప్యాసింజర్ బోటు మునిగిన ఘటనలో 23 మందికిపైగా గల్లంతయ్యారు.. ఇప్పటి వరకు వెలికి తీసిన మృతదేహాల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారని, గల్లంతైన వారికి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ఎంతమంది గల్లంతయ్యారన్న స్పష్టమైన సమాచారం లేదన్న అధికారులు.. ప్రమాద సమయంలో బోటులో 70 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలోబంగ్లాదేశ్‌లో వరుస పడవ ప్రమాదాలు ఆఅందోళన కలిగిస్తున్నాయి. ప్రతి ఏడాది వందలాదిమంది ఇటువంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నా కూడా సరైన సౌకర్యాలు, భద్రతా పరమైన చర్యలు చేపట్టకపోవడంతో అధికారులు విఫమవుతున్నారు.పద్మా నదిలో ఈ ఏడాది మేలో ప్రయాణికులతో వెళ్తున్న స్పీడ్‌బోటు ఓ ఇసుక కేరియర్‌ను ఢీకొట్టడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.