Site icon HashtagU Telugu

Shocking News : పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో ఆసుపత్రి పై కప్పుపై 200 మృతదేహాలు..కుళ్లిపోయి..చెట్లు మొలిచి…!!

Pakistan

Pakistan

పాకిస్తాన్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ భయానక ఘటన పంజాబ్ లో జరిగింది. ముల్తాన్ లోని ఓ ఆసుపత్రి పైకప్పునుంచి 200 మృతదేహాలు లభ్యమయ్యాయి. అవి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలోఉన్నాయి. కొన్ని మృతదేహాలపై చెట్లుకూడా మొలిచాయి. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిష్టర్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనపై విచారణకు దక్షిణ పంజాబ్ ఆరోగ్య శాఖ ఆరుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది.

అంతకుముందు పాకిస్తాన్ పంజాబ్ సీఎం చౌదరి జమాన్ గుజ్జర్ సలహాదారు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి మార్చురీ పై కప్పు నుంచి కుళ్లిన స్థితిలో ఉన్న శవాలను ఆయన చూశారు. ఆ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై ప్రమేయం ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటూ ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని నిష్తార్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ కోరింది.

కాగా ఈ శవాలను మెడికల్ విద్యార్థులు వైద్య ప్రయోగాలకోసం ఉపయోగిస్తున్నారని నిష్తర్ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థి చెప్పారు. ఈ శవాలను ఇప్పటికే ప్రయోగం కోసం దాచిపెట్టామని…తదుపరి వైద్య అవసరాల కోసం ఎముకలు, పుర్రెలను తీయడానికే పై కప్పుపై ఉంచినట్లు చెప్పారు.