Florida: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వేరువేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు ఆరుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అట్లాంటా, ఫ్లోరిడాలలో కాల్పులు చోటు చేసుకున్నాయి.
అమెరికాలో తుపాకీ సంస్కృతి ఎక్కువైంది. ప్రతి పది మందిలో ఒకరికి తుపాకీ లైసెన్స్ ఇస్తున్నారు. దీంతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఫ్లోరిడాలోని ఈస్ట్ 7వ అవెన్యూలోని 1600 బ్లాక్‌లో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవతో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. అయితే మృతుల్లో 14 ఏళ్ల బాలుడు ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్కులని, వారికి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్న కొంతమంది వ్యక్తుల సహాయంతో అనుమానాస్పద వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్లు టంపా పోలీస్ చీఫ్ లీ బెర్కోవ్ తెలిపారు.
Also Read: Bigg Boss 7 : బిగ్ బాస్ హౌస్ లో ఐరన్ మ్యాన్. అతను నామినేట్ చేస్తే ఎలిమినేట్ పక్కా..!