Site icon HashtagU Telugu

China: చైనాలో కూలిన బంగారు గని.. చిక్కుకున్న 18 మంది మైనర్లు

China MINE

Resizeimagesize (1280 X 720) (3) 11zon

వాయువ్య చైనా (China)లోని జిన్‌జియాంగ్ ప్రాంతంలోని బంగారు గనిలో గుహలో చిక్కుకున్న 18 మంది (18 miners)ని ఆదివారం రెస్క్యూ అధికారులు కనుగొన్నట్లు అక్కడి రాష్ట్ర మీడియా తెలిపింది. శనివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగినప్పుడు కజకిస్తాన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల (60 మైళ్లు) దూరంలో ఉన్న యినింగ్ కౌంటీలోని గనిలో మొత్తం 40 మంది వ్యక్తులు భూగర్భంలో పనిచేస్తున్నారు. 22 మంది మైనర్లను పైకి తీసుకురాగా.. 18 మంది మైనర్లు గనిలోనే చిక్కుకుపోయారు.

Also Read: Bomb cyclone: అమెరికాలో తుఫాను బీభత్సం.. 18 మంది మృతి

మిగిలిన మైనర్లను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. వీరిని వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ క్రమంలో ఆ ప్రాంతం అంతటా ఆందోళన నెలకొంది. గత ఏడాది సెప్టెంబరులో వాయువ్య ప్రావిన్స్ కింగ్‌హైలో బొగ్గు గని కూలిపోవడంతో భూగర్భంలో చిక్కుకున్న 19 మంది మైనర్లు సుదీర్ఘ శోధన తర్వాత చనిపోయినట్లు గుర్తించారు. డిసెంబర్ 2021లో ఉత్తర షాంగ్సీ ప్రావిన్స్‌లో వరదలు సంభవించినప్పుడు బొగ్గు గని నుండి 20 మంది మైనర్లు రక్షించబడ్డారు. మరో ఇద్దరు మరణించారు.

Exit mobile version