15 Lost Life : పడవ బోల్తా.. 15 మంది దుర్మరణం.. ప్రమాద కారణం ఇదీ

15 Lost Life : ప్రయాణికులతో ఓవర్ లోడ్ అయిన పడవ మార్గం మధ్యలో బోల్తా పడింది.

Published By: HashtagU Telugu Desk
15 Lost Life

15 Lost Life

15 Lost Life : ప్రయాణికులతో ఓవర్ లోడ్ అయిన పడవ మార్గం మధ్యలో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న దాదాపు 50 మందిలో 15 మంది చనిపోయారు.  ఈ ఘోర ప్రమాదం ఇండోనేషియాలోని సులవెసి ద్వీపంలో చోటుచేసుకుంది. ఈ పడవ ఆగ్నేయ సులవెసి ప్రావిన్స్‌లోని లాంటో గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చెక్కతో చేసిన ఈ పడవలో కేవలం 20 మంది ప్రయాణించే వీలుంది. కానీ 50 మందిని పడవలోకి ఎక్కించుకోవడంతో అది బ్యాలెన్స్ కోల్పోయింది.

Also read : New party secret : చంద్ర‌బాబు చ‌తుర‌త‌పై జ‌గ‌న్ హైరానా! BCYP ర‌హ‌స్య కోణం.!!

పడవ బోల్తా పడగానే 27 మంది ఈదుకుంటూ బయటకు వచ్చారు. మరో ఆరుగురిని  రెస్క్యూ టీమ్ కాపాడింది.  15 మంది మృతదేహాలు(15 Lost Life)  లభ్యమయ్యాయి. ఇండోనేషియాలో 17,000 కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్నాయి. ఈ దేశంలో ఫెర్రీ ప్రమాదాలు నిత్యం జరుగుతుంటాయి. 2018లో సుమత్రా ద్వీపంలోని లేక్ టోబాలో ఫెర్రీ బోల్తా పడిన ఘటనలో 192 మంది ప్రయాణికులు మరణించారు.

Also read :Man Forced To Lift Shoe : వీడియో వైరల్.. రెండేళ్ల తర్వాత అమానుషం వెలుగులోకి.. నిందితుల అరెస్ట్  

  Last Updated: 24 Jul 2023, 05:04 PM IST