15 Hindu Students injured: పాకిస్థాన్ లో దారుణం.. హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులపై దాడి

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో హిందూ విద్యార్థులను (Hindu Students) ఓ ఇస్లామిక్ సంస్థ కార్యకర్తలు వెంబడించి కొట్టారు. ప్రధాన నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Written By:
  • Publish Date - March 8, 2023 / 06:46 AM IST

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో హిందూ విద్యార్థులను (Hindu Students) ఓ ఇస్లామిక్ సంస్థ కార్యకర్తలు వెంబడించి కొట్టారు. ప్రధాన నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ వార్తా వెబ్‌సైట్ డాన్ ప్రకారం.. క్యాంపస్‌లో హోలీ పండుగ జరుపుకునే వివాదంలో కనీసం 15 మంది హిందూ సమాజానికి చెందిన విద్యార్థులు గాయపడ్డారు. హోలీ పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సింధ్ కౌన్సిల్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తమకు అనుమతి ఉందని పేర్కొంది.

ఇదిలావుండగా ఇస్లామీ జమియత్ తుల్బా అనే సంస్థ సభ్యులు వారిపై దాడి చేశారు. దీని తరువాత హిందూ విద్యార్థులను క్యాంపస్ అంతటా వెంబడించి రాళ్లు, ఇతర వస్తువులతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా, అది చాలా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నారు. ఈ ఘటనపై పాకిస్థాన్ పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Blast in Dhaka: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు.. 17 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు

సమాచారం ప్రకారం.. పంజాబ్ యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌లోని లా కాలేజీకి చెందిన 30 మంది హిందూ విద్యార్థులు హోలీని జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి లిఖితపూర్వక అనుమతి కూడా తీసుకున్నారు. ఈ విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం పండుగ జరుపుకోవడానికి గుమిగూడినప్పుడు అకస్మాత్తుగా ముస్లిం విద్యార్థి సంస్థ ఇస్లామిక్ జమియత్ తుల్బా IJT సభ్యులు అక్కడికి చేరుకుని హిందూ విద్యార్థులను అడ్డుకోవడం ప్రారంభించారు. హిందూ విద్యార్థులపై IJT సభ్యులు దాడి చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అప్పుడే చేతుల్లో లాఠీలు పట్టుకున్న యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు కూడా అక్కడికి చేరుకున్నారు. IJT సభ్యులతో పాటు సెక్యూరిటీ గార్డులు కూడా హిందూ విద్యార్థులను కొట్టడం ప్రారంభించారని హిందూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

హిందూ విద్యార్థులపై జరిగిన ఈ దాడికి వ్యతిరేకంగా సింధ్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ కాషిఫ్ బరోహి స్పందించారు. యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ అనుమతితో హిందూ సమాజం, కౌన్సిల్ హోలీ వేడుకలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. దాని ఆహ్వానాన్ని కూడా IJT ఫేస్‌బుక్ పేజీలో హిందూ విద్యార్థి ఒకరు పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన ఐజేటీ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బెదిరింపులకు దిగారని అన్నాడు.

ఇదిలా ఉండగా.. మైనారిటీ హిందూ సమాజానికి చెందిన దాదాపు 22,10,566 మంది పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు. దేశంలోని మొత్తం జనాభా 18,68,90,601లో కేవలం 1.18 శాతం మాత్రమే హిందువులు ఉన్నారని సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పాకిస్తాన్ నివేదిక తెలిపింది.