Turkey: 140 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రాత్రికి రాత్రే పాస్‌పోర్ట్‌ లు!

కష్టతరమైన మిషన్ తర్వాత వారు భారతదేశానికి తిరిగి వచ్చారు, వారి హృదయంలో కొంత భాగం "మేము మరిన్ని ప్రాణాలను రక్షించగలమా"

భూకంపం సంభవించిన కొద్ది గంటల్లోనే ‘ఆపరేషన్‌ దోస్త్‌’ (Operation Dost) పేరిట భారత్ సహాయక చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏడు భారీ విమానాల్లో ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలు, సహాయక బృందాలు, జాగిలాలను పంపించింది. మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF Team) బృందాలు, భారత సైన్యానికి చెందిన రెండు బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ కోసం ఓ పారా మెడికో (Para Medico) తన ఏడాదిన్నర వయసున్న తన కవల పిల్లలను వదిలిపెట్టి తుర్కీయేకు (Turkey) బయలుదేరింది.

అంతేకాదు, ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్కడ వెళ్లే 140 మందిపైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రాత్రికి రాత్రే పాస్‌పోర్ట్‌లను సిద్ధం చేసింది ప్రభుత్వం. అక్కడ రెండు వారాల పాటు సేవలందించిన సైన్యం సోమవారం స్వదేశానికి చేరుకుంది.రోజుల తరబడి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు స్నానాలు కూడా చేయలేదు. అయితే, తమ పట్ల భూకంప బాధితులు చూపిన ఆదరాభిమానుల ముందు ఇవన్నీ తమకు కష్టంగా అనిపించలేదని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్న డిప్యూటీ కమాండెంట్ దీపక్ మాట్లాడుతూ.. తుర్కీయే ప్రజలు తమపై ఎనలేని ప్రేమను చూపారని అన్నారు.