14 Soldiers Killed: ఉగ్రదాడిలో 14 మంది సైనికులు మృతి

ఇస్లామిక్ తీవ్రవాదులు చేసిన దాడిలో 14 మంది సైనికులు (14 Soldiers Killed) మరణించారని, ఇంకా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని మాలి ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ తీవ్రవాదులు అధునాతన పేలుడు పదార్థాలను వినియోగించారని, ఈ దాడుల్లో మాలి దళాలు సుమార్ 30మంది తీవ్రవాదులను మట్టుబెట్టాయని మాలి ఆర్మీ అధికారి వెల్లడించారు.

Published By: HashtagU Telugu Desk
terroists

Resizeimagesize (1280 X 720)

ఇస్లామిక్ తీవ్రవాదులు చేసిన దాడిలో 14 మంది సైనికులు (14 Soldiers Killed) మరణించారని, ఇంకా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని మాలి ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ తీవ్రవాదులు అధునాతన పేలుడు పదార్థాలను వినియోగించారని, ఈ దాడుల్లో మాలి దళాలు సుమార్ 30మంది తీవ్రవాదులను మట్టుబెట్టాయని మాలి ఆర్మీ అధికారి వెల్లడించారు. ఈ దాడిలో 14 మంది సైనికులు మృతి చెందారు. మరో 12 మంది సైనికులు గాయపడ్డారు. సెంట్రల్ మాలిలోని కౌమారా, మాసినా పట్టణాల మధ్య ఈ పేలుళ్లు జరిగినట్లు ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ కల్నల్ సౌలేమనే డెంబెలే తెలిపారు. మరో రెండు గ్రామాల్లో కూడా తీవ్రవాదులు దాడి చేసినట్లు డెంబెలే పేర్కొన్నారు. ఈ వారం మొదట్లో 30 మందికి పైగా ఉగ్రవాదులను మాలి సైనికులు హతమార్చినట్లు చెప్పారు.

Also Read: Mumbai : మ‌నిలాండ‌రింగ్ కేసులో ముంబైకి చెందిన బిల్డ‌ర్ అరెస్ట్‌.. రూ. 500 కోట్ల‌కు పైగా..!

హింసను అరికట్టడానికి అదనపు సైనికులను నియమించినప్పటికీ, దేశంలో తీవ్రవాదుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తీవ్రవాదాన్ని రూపుమాపాలనే ప్రయత్నం ఫలించడం లేదు అని ఇంటెలిజెన్స్ అడ్వైజరీ సీఈఓ లైత్ అల్ఖౌరి తెలిపారు. ఈ ఘటన మాలి సైనికుల సంకల్పాన్ని బలహీన పరిచే అవకాశం ఉందని.. ఇలాంటి దాడులు మరిన్ని జరిగితే సైన్యం అదనపు భద్రత చర్యలను చేపట్టవలసి ఉంటుందని ఆయన వెల్లడించారు. 2012 నుండి మాలి భద్రత, రాజకీయ, ఆర్థిక స్థాయిలలో లోతైన బహుముఖ సంక్షోభంలో చిక్కుకుంది. స్వాతంత్య్ర తిరుగుబాట్లు, జిహాదీల చొరబాట్లు,అంతర్-మత హింస కారణంగా పశ్చిమ ఆఫ్రికా దేశంలో వేలాది మంది మరణించారు. వందల వేల మంది నిరాశ్రయులయ్యారు.

 

  Last Updated: 13 Jan 2023, 08:15 AM IST