Site icon HashtagU Telugu

Plane Crash : బ్రెజిల్ లో కూలిన టూరిస్టు విమానం.. 14 మంది మృతి

Plane Crash

Plane Crash

Plane Crash : బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. స్పోర్ట్ ఫిషింగ్ కోసం 12 మంది టూరిస్టులతో మనౌస్ సిటీ నుంచి బార్సిలోస్‌ కు బయలుదేరిన విమానం అదుపు తప్పి  ఒక్కసారిగా కూలిపోయింది. ఉత్తర  అమెజాన్ రాష్ట్రంలోని బార్సిలోస్  ప్రావిన్స్ లో ఉన్న ఒక ప్రాంతంలో  విమానం కూలడంతో అందులో ఉన్న 12 మంది ప్రయాణికులు, ఇద్దరు విమాన పైలట్లు చనిపోయారు. ఇది చిన్నపాటి టూరిస్టు విమానం కావడంతో ఇందులో 18 మందికి మించి ప్రయాణించే అవకాశం లేదు. ఈ ఘటనను బార్సిలోస్  ప్రావిన్స్ గవర్నర్ ధ్రువీకరించారు.

Also read : Modi Birthday Discount : ఈరోజు ఆటో ప్రయాణికులకు 30 శాతం డిస్కౌంట్.. ఎక్కడంటే ?

కూలిపోయిన ఈ విమానం EMB-110  మోడల్ కు చెందినది. బ్రెజిల్ విమానాల తయారీ సంస్థ ఎంబ్రేయర్ ఈ విమానాలను తయారు చేస్తోంది. Manaus Aerotaxi ఎయిర్‌లైన్ అనే కంపెనీ ఈ విమానాన్ని టూరిస్టులకు అద్దెకు ఇచ్చింది. విమానం ఎందుకు కూలింది ? కూలడానికి ముందు విమానంలో ఏం జరిగింది ?  సాంకేతిక కారణాలు ఏమిటి ? అనే వివరాలపై దర్యాప్తు చేస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారు. మనౌస్ సిటీ నుంచి బార్సిలోస్‌ కు 90 నిమిషాల వ్యవధిలో విమానంలో (Plane Crash)  చేరుకోవచ్చు. అయితే మార్గం మధ్యలో విమానం ఎలా క్రాష్ అయింది ? అనే దానిపై ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.