Site icon HashtagU Telugu

14 Killed: ఉత్తర ఇరాక్ యూనివర్సిటీ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం.. 14 మంది మృతి, 18 మందికి గాయాలు..!

Indian Student Dies In US

Crime Imresizer

14 Killed: ఇరాక్‌లోని ఉత్తర నగరమైన ఎర్బిల్ సమీపంలో ఉన్న ఉత్తర ఇరాక్ విశ్వవిద్యాలయం (Northern Iraq University)లోని హాస్టల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది (14 Killed) మరణించారు. 18 మంది గాయపడ్డారు. ఎర్బిల్‌కు తూర్పున ఉన్న సొరన్ అనే చిన్న పట్టణంలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయని సోరన్ హెల్త్ డైరెక్టరేట్ హెడ్ కమ్రం ముల్లా మహమ్మద్ తెలిపారు. స్థానిక వార్తా సంస్థ రుడావో ప్రకారం.. అర్థరాత్రికి మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ సంఘటన శుక్రవారం (డిసెంబర్ 8) సాయంత్రం జరిగింది. మృతుల సంఖ్యను ప్రభుత్వ మీడియా ధృవీకరించింది.

శుక్రవారం రాత్రికి మంటలు ఆరిపోయాయని స్థానిక వార్తా సంస్థ రుడావ్ నివేదించింది. రుడావ్ ప్రకారం.. ప్రాథమిక దర్యాప్తులో అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని చెప్పబడింది. ఈ ప్రాంతం కుర్దిస్థాన్ ప్రావిన్స్‌లోకి వస్తుంది. ఈ ఘటనపై కుర్దిస్థాన్ ప్రధాని మస్రోర్ బర్జానీ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

Also Read: Canada: కెనడా వెళ్లనున్న భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..!

ఇరాక్‌లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణం

ఇరాక్‌లో భవనాల్లో అగ్నిప్రమాదం వంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. భద్రతా నిబంధనలను బేఖాతరు చేస్తూ తరచుగా అక్కడ నిర్మాణాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా రవాణా శాఖలోనూ అజాగ్రత్త ఎక్కువగా ఉంది. ఇరాక్‌లో ప్రభుత్వ వ్యవస్థ ప్రాథమిక నిర్మాణం నిరంతరంగా కుప్పకూలుతోంది. దశాబ్దాలుగా దేశం అవినీతితో బాధపడుతోంది. దీని పర్యవసానాలను దేశ జనాభా అనుభవిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇరాక్‌లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణం. ఈ సంఘటనలు ఏ దేశంలోనైనా జరిగినప్పటికీ ఇరాక్‌లో ఇటువంటి ప్రమాదాలలో ప్రజలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఉత్తర ఇరాక్‌లోని కారకాస్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు వంద మంది చనిపోయారు. ఈ ఘటనపై విచారణలో భవనంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు లేవని తేలింది. భద్రతా నిబంధనలను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించినట్లు విచారణ అధికారులు తెలిపారు.