Site icon HashtagU Telugu

Iran: ఇరాన్ లో 1,200 మంది విద్యార్థులపై విషప్రయోగం..!

Iran Poison

Poison

విద్యార్థులు ఆందోళన చేస్తామని ప్రకటించిన తేదీకి ఒక రోజు ముందు ఇరాన్‌ (Iran)ప్రభుత్వం వారిపై విషప్రయోగం (Poison) చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిన్న ఆహారం తిన్న తర్వాత దాదాపు 1,200 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిపై విషప్రయోగం జరిగిందని ది నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యార్థులు వాంతులు, తీవ్రమైన నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఖరాజమీ, ఆర్క్‌ విశ్వవిద్యాలయాలు సహా మరో నాలుగు యూనివర్శిటీల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విశ్వవిద్యాలయ కెఫెటేరియాల్లో తినకూడదని నిర్ణయించుకొన్నారు.

అధికారులు మాత్రం నీటిలో కలుషిత బ్యాక్టిరీయా కారణంగా ఇలా జరుగుతోందని చెబుతున్నారు. తమ గత అనుభవాల దృష్ట్యా ఇది అధికారుల చర్యే అని నమ్ముతున్నారు. అంతర్జాతీయ రాక్‌ క్లైంబింగ్‌ పోటీల్లో హిజాబ్‌ (Hijab Protest) ధరించకుండా పాల్గొన్న ఇరాన్‌ (Iran) క్రీడాకారిణి(Elnaz Rekabi) ఎల్నాజ్‌ రెకబీ ఇంటిని అధికారులు ధ్వంసం చేశారు. ఇరాన్‌ (Iran)లో నైతిక పోలీస్‌ విభాగాన్ని రద్దు చేసిన మర్నాడే ఈ వార్త వెలువడటం గమనార్హం. ఇరానియన్‌ వైర్‌ పత్రిక ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. దెబ్బతిన్న ఇంటి చిత్రాలను కూడా ప్రదర్శించింది.

ఎల్నాజ్‌ సాధించిన పతకాలను వీధిలో పడేశారు చాలా వైద్యశాలలు మూసివేశారు. దీంతో బాధితులు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు డీహైడ్రైషన్‌ చికిత్సకు అవసరమైన ఔషధాల కొరత ఏర్పడింది. నైతిక పోలీసు విభాగాన్ని తొలగిస్తున్నామని ఇరాన్‌ ప్రాసిక్యూటర్‌ జాఫర్‌ మోంటజెరి ప్రకటన వెలువడిన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగడం విశేషం.

Also Read:  Yashoda: ఓటీటీలోకి ‘యశోద’ మూవీ. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎందులో అంటే..