రష్యా దళాలపై ఉక్రెయిన్ ప్రతిదాడికి దిగింది. సరైన ఆయుధాలు లేని మాస్కో సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని ఉక్రెయిన్ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. కీవ్ దాడుల్లో ఒక్క రోజే కనీసం 1000 మంది రష్యా సైనికులు చనిపోయారని ప్రకటించింది. ఉక్రెయిన్ దళాలు ఎటువంటి సన్నద్ధత లేని రష్యన్ సైనికులను లక్ష్యంగా చేసుకుని కనీసం 1,000 మందిని చంపడంతో రష్యా ఒక్క రోజులో అత్యధిక సంఖ్యలో ప్రాణనష్టాన్ని చవిచూసింది. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 71,200 మంది వరకు రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రష్యా, ఉక్రెయిన్‌తో యుద్ధం మధ్య ధాన్యాలను ఎగుమతి చేయడానికి ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వ ఒప్పందం నుండి వైదొలిగింది. ఈ ఒప్పందానికి UN, టర్కీ జూలైలో మధ్యవర్తిత్వం వహించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్రిమియాలోని రష్యా నౌకలపై దాడి చేయడానికి గ్రెయిన్ కారిడార్‌ను ఉపయోగించారని ఆరోపించిన తరువాత ఉక్రెయిన్ నుండి భద్రతా హామీలను డిమాండ్ చేశారు.