10 Lakh Children Died : ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్) సంచలన నివేదికను విడుదల చేసింది. 2016 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం మధ్యకాలంలో వివిధ రకాల వాతావరణ విపత్తుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది పిల్లలు చనిపోయారని వెల్లడించింది. తుఫానులు, కరువు, అడవుల్లో కార్చిచ్చు వంటి ఘటనల వల్ల దాదాపు 1 మిలియన్ బాలలు మృత్యువాత పడ్డారని పేర్కొంది. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ విపత్తుల కారణంగా 2016 నుంచి 2021 మధ్యకాలంలో 44 దేశాల్లో 4.3 కోట్ల మంది బాలలు నిరాశ్రయులయ్యారని యూనిసెఫ్ తెలిపింది. చైనా, భారతదేశం, ఫిలిప్పీన్స్ దేశాల్లో అత్యధికంగా 2.3 కోట్ల మంది పిల్లలు నిరాశ్రయులయ్యారని నివేదిక చెప్పింది.
We’re now on WhatsApp. Click to Join
2016 నుంచి 2021 సంవత్సరం మధ్యకాలంలో.. ఆఫ్రికా దేశం డొమినికాలోని పిల్లల జనాభాలో 76 శాతం మంది నిరాశ్రయులయ్యారని పేర్కొంది. క్యూబా, సెయింట్ మార్టిన్ దేశాలలో 30 శాతం మంది పిల్లలు విపత్తులతో బాధ పడ్డారని వివరించింది. రాబోయే 30 ఏళ్లలో.. పొంగిపొర్లుతున్న నదులు, వరదల కారణంగా 9.6 కోట్ల మంది పిల్లలు, తుఫానుల వల్ల కోటిమంది పిల్లలు నిరాశ్రయులయ్యే ముప్పు ఉందని హెచ్చరించింది. నవంబర్, డిసెంబరులో దుబాయ్ వేదికగా జరగనున్న కాప్ 28 వాతావరణ సదస్సులో ఈ అంశాాలపై ఫోకస్ చేయాలని ప్రపంచ దేశాల నాయకులను యూనిసెఫ్ (10 Lakh Children Died) కోరింది.
Also read : Petrol Diesel: హైదరాబాద్, విజయవాడలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?