Fire Spreads To Multiple Floors: చికాగోలో భారీ అగ్నిప్రమాదం.. ఓ వ్యక్తి సజీవదహనం

చికాగో (Chicago) లోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. సౌత్ లేక్ పార్క్ అవెన్యూ 4800-బ్లాక్‌లోని 25 అంతస్తుల హార్పర్ స్క్వేర్ కో-ఆపరేటివ్ భవనంలోని 15వ ఫ్లోర్ లో మంటలు చెలరేగి పలు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 15వ ఫ్లోరులో నివసించే ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు.

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 12:32 PM IST

చికాగో (Chicago) లోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. సౌత్ లేక్ పార్క్ అవెన్యూ 4800-బ్లాక్‌లోని 25 అంతస్తుల హార్పర్ స్క్వేర్ కో-ఆపరేటివ్ భవనంలోని 15వ ఫ్లోర్ లో మంటలు చెలరేగి పలు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 15వ ఫ్లోరులో నివసించే ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు 9 ఫ్లోర్లకు వ్యాపించాయి. వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పివేశారు.

Also Read: Donald Trump: ట్రంప్‌ ఈజ్ బ్యాక్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోకి ఎంట్రీ..!

చికాగో నగరంలోని దక్షిణం వైపు ఉన్న బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనంలో బుధవారం మంటలు చెలరేగినట్లు చికాగో అధికారులు తెలిపారు. ఒకరు మృతి చెందగా, కాలిన గాయాలతో మరో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక అధికారులు మంటలు చెలరేగినట్లు భావిస్తున్న అపార్ట్‌మెంట్‌లో మరణించిన వ్యక్తి కనిపించాడని అధికారులు తెలిపారు. ఆస్పత్రికి తరలించిన ఆరుగురిలో ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి గాయాలైనట్లు అంచనా వేస్తున్నామని, అయితే పరిస్థితి బాగానే ఉందని అధికారులు చెప్పారు. మంటల కారణంగా కనీసం తొమ్మిది అంతస్తులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.