Zomoto CEO : వన్ డే డెలివరీ ఏజెంట్‌గా మారింన జొమాటో సీఈవో.. ఎందుకో తెలుసా..?

జొమాటో సీఈవో డెలివరీ బాయ్ గా అవతారమెత్తిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Zomoto CEO Deepinder Goyal deliver food on Friendship day special

Zomoto CEO Deepinder Goyal deliver food on Friendship day special

స్నేహితుల దినోత్సవం సందర్భంగా జొమాటో సీఈవో (Zomato CEO) దీపీందర్ గోయల్ (Deepinder Goyal ) డెలివ‌రీ బాయ్ (Delivery Boy) అవ‌తార‌మెత్తారు. స్వయంగా ఆయనే కస్టమర్స్‌కి బైక్‌పై ఫుడ్ డెలివరీ చేశాడు. అన్ని చోట్లా తిరుగుతూ వారికి ఫుడ్‌తో పాటు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ (Friendship Band) లనూ ఇచ్చాడు. డెలివరీ పార్ట్‌నర్స్‌కి, రెస్టారెంట్ పార్ట్‌నర్స్‌కీ ఆయనే స్వయంగా డెలివరీ చేశాడు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై జొమాటో బ్యాగ్‌ వెనకాల పెట్టుకుని, డెలివరీ బాయ్ టీషర్ట్ వేసుకుని “ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు డెలివరీ చేయడానికి వెళ్తున్నా” అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశాడు.

నిజానికి అప్పుడప్పుడు జొమాటో సీనియర్ ఉద్యోగులు స్వయంగా ఆర్డర్ల డెలివరీ పని చేస్తుంటారు. డెలివరీ భాగస్వాములు, కస్టమర్ల అవసరాలు, ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తుంటారు. ఇప్పుడు జొమాటో సీఈవో డెలివరీ బాయ్ గా అవతారమెత్తిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

నెటిజన్లు ఈ పోస్ట్‌ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కొందరు కస్టమర్స్‌ అయితే ఈరోజు ఆర్డర్ పెడితే జొమాటో సీఈవోని చూడబోతున్నారంటూ ఎగ్జైటింగ్గ్ కామెంట్స్ పెట్టారు. చాలా తక్కువ సమయంలోనే జొమాటో బాగా పాపులర్ అయింది. మిగతా ఫుడ్ డెలివరీ ఆప్స్ కు గట్టి పోటీ ఇస్తోంది. అయితే మార్కెట్‌లో దూసుకుపోవాలంటే పని ఒక్కటే కాదు ప్రమోషన్ కూడా కావాలి. జనాలు మనల్ని గురించి తమకు తాముగా మాట్లాడేలా ఏదో ఒకటి చెయ్యాలి. అలా చేయడానికే ఈరోజు ఇలా వైరల్ న్యూస్ క్రియేట్ చేశారు జొమాటో సీఈవో.

  Last Updated: 06 Aug 2023, 09:50 PM IST