Site icon HashtagU Telugu

Zomato Boy To Government Job : గవర్నమెంట్ ఆఫీసర్ కాబోతున్న జొమాటో బాయ్.. కంగ్రాట్స్ చెప్పిన జొమాటో

Zomato Boy To Government Job

Zomato Boy To Government Job

Zomato Boy To Government Job : “నువ్వు సౌండ్ చేయొద్దు.. నీ సక్సెస్ సౌండ్ చేయాలి” అన్నారు పెద్దలు.. 

దీన్ని అతడు నిజం చేసి చూపించాడు..  

జొమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేసిన ఆ కుర్రాడు సాధించిన సక్సెస్ ఇప్పుడు అంతటా రీసౌండ్ ఇస్తోంది ..

చేసేది చిన్న పనే అయినా.. పెద్ద లక్ష్యం పెట్టుకున్నాడు..

కష్టపడి చదివి తన కోసం గోల్డెన్ ఫ్యూచర్ ను రెడీ చేసుకున్నాడు..

గ్రూప్ 4 ఎగ్జామ్ లో విజయఢంకా మోగించి, స్టేట్  గవర్నమెంట్  జాబ్ ను సొంతం చేసుకున్న తమిళనాడు యువకెరటం విఘ్నేష్ కు జొమాటో కూడా కంగ్రాట్స్ చెప్పింది.

విఘ్నేష్ ను అభినందిస్తూ ట్వీట్ చేసింది.. 

తమ దగ్గర డెలివరీ బాయ్ గా పనిచేసిన  విఘ్నేష్ కు ప్రభుత్వ జాబ్ వచ్చినందుకు హర్షం వ్యక్తం చేసింది.

అతడి కోసం అందరూ ఒక్కో లైక్ చేయాలని నెటిజన్స్ ను జొమాటో కోరింది.         

Also read : NBK’s Bhairava Dweepam: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, భైరవద్వీపం రీరిలీజ్

విఘ్నేష్ విజయాన్ని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో జొమాటో పెట్టిన  పోస్ట్ ను ఇప్పటివరకు 70 వేల మందికి పైగా చూశారు. చాలామంది విఘ్నేష్ విజయాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. “మిస్టర్ విఘ్నేష్ చేసిన కృషి నిజంగా అభినందనీయం. విఘ్నేష్ కష్టం ఇక తీరినట్టే” అని ఒకరు కామెంట్ చేశారు. “అతడిలో ఉన్న పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైంది”(Zomato Boy To Government Job) అని మరొకరు అభిప్రాయపడ్డారు. ఇక గ్రూప్ 4 జాబ్ కు ఎంపికైన విఘ్నేష్ కు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ గ్రేడ్-1, బిల్ కలెక్టర్, వంటి వాటిలో ఏదో ఒక జాబ్ పోస్టింగ్ లభించనుంది.

Also read : Krithi shetty : వర్షంలో జాలిగా తడుస్తూ.. ఫోటో షూట్ చేస్తున్న కృతి