Maggi Cost in Airport : ప్లేట్ మ్యాగీ ఏకంగా 193 రూపాయలు.. బిల్ చూసి ఆశ్చర్యపోయిన యూట్యూబర్..

ప్లేట్ మ్యాగీ నూడుల్స్(Maggi noodles) ధర అక్షరాలా 193 రూపాయలు అంటే మీరు నమ్ముతారా. అలా అని ఇదేదో వేరే దేశంలోనో అనుకోకండి. ఇక్కడే మనదేశంలోని ఓ ఎయిర్పోర్ట్ లో మ్యాగీ ప్రైస్ ఇది.

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 06:00 AM IST

ఇలా ఆకలేస్తే అలా తయారయ్యే డిష్ మ్యాగీ(Maggi). బాగా ఆకలేసినా, కాస్త వేడివేడిగా త్వరగా ఏదైనా తినాలనిపించినా వెంటనే గుర్తొచ్చేది మ్యాగీ నూడుల్స్. దీని ధర కూడా పది రూపాయలు, ఇరవై రూపాయలకు మించదు. దాన్ని తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకుంటాం. ఇక బయట మ్యాగీ తింటే మహా అయితే ప్లేట్ 50 రూపాయల వరకు ఉంది.

అలాంటిది ప్లేట్ మ్యాగీ నూడుల్స్(Maggi noodles) ధర అక్షరాలా 193 రూపాయలు అంటే మీరు నమ్ముతారా. అలా అని ఇదేదో వేరే దేశంలోనో అనుకోకండి. ఇక్కడే మనదేశంలోని ఓ ఎయిర్పోర్ట్ లో మ్యాగీ ప్రైస్ ఇది.

సేజల్ సూద్ అనే యూట్యూబర్ ఇటీవల ఎయిర్పోర్ట్ (airport) లో ఆకలేసి మ్యాగీ నూడిల్స్ ను ఆర్డర్ చేశారు. దానికి అక్కడ సిబ్బంది ప్లేట్ ధర రూ. 184, జీఎస్టీ కింద రూ. 9 కలిపి మొత్తం రూ.193 వసూలు చేశారు. షాక్ అయిన ఆమె బిల్లు పే చేసి తరువాత ఆ విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విషయంపై ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదన్నారు. దీనిపై స్పందించిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరు ఎయిర్పోర్టులో కొనుగోలు చేసిన అతి తక్కువ ధర ఉన్న వస్తువు ఇదే అయ్యి ఉండొచ్చు అంటూ పలువురు తాము కొనుగోలు చేసిన వస్తువుల ధరల జాబితాలతో రిప్లైలు ఇస్తున్నారు. దీంతో సేజల్ సూద్ పోస్ట్ వైరల్ గా మారింది.

 

Also Read : Japan : మూడేళ్లలో 3 వేల ఎమర్జెన్సీ కాల్స్ చేసిన మహిళ.. ఎందుకు చేసిందో తెలుసా..