Site icon HashtagU Telugu

Traffic Police : ట్రాఫిక్ పోలీస్ ను చూడగానే భయంతో లవర్ ను బైక్ ఫై నుండి కిందపడేసిన యువకుడు

Youth Throws Off His Girlfriend From Bike

Youth Throws Off His Girlfriend From Bike

వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ పోలీసులను (Traffic Police ) చూస్తే కాస్త ఖంగారుపడుతుంటారు. ఎక్కడ మన వాహనాన్ని ఆపుతారో..ఏది లేదని ఫైన్ వేస్తారో అని భయపడుతుంటారు. ముఖ్యంగా బైక్ నడిపేవారు. కాస్త దూరంలో ట్రాఫిక్ పోలీస్ కనిపించిన, వాహనాలను తనిఖీలు చేస్తున్న..భయంతో వారికి దొరక్కుండా గల్లీల లోనుంచి పారిపోతారు. లేకపోతే వారి దగ్గరి నుంచి తప్పించుకునేందుకు స్పీడుగా వెళ్తూ ఉంటారు. అలా కొన్నిసార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఓ యువకుడు తన లవర్ ను వెనకాల కూర్చుపెట్టుకొని (Youth Throws Off His Girlfriend) వెళ్తున్నాడు. సడెన్ గా రోడ్ ఫై ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆపుతుండడం తో భయం తో సదరు యువకుడు బైక్ ను స్పీడ్ గా పోనిచ్చాడు. ఇంతలో వెనుకాల కూర్చున్న లవర్ కిందపడింది. అయినప్పటికీ ఆమెను పట్టించుకోకుండా అలాగే బైక్ (Bike) ను ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటన లో గాయపడిన సదరు యువతిని పోలీసులు రక్షించి హాస్పటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. ఈ వీడియోను అభిషేక్ ఆనంద్ అనే జర్నలిస్ట్.. సోమవారం ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దానికి ఓ క్యాప్షన్ పెట్టారు. చలాన్ చెల్లించకూడదన్న ఆ యువకుడి ఆతృత.. లవర్‌కు దెబ్బ తగిలేలా చేసింది అని పేర్కొన్నారు. చలాన్ నుంచి తప్పించుకునేందుకే ఆమెను బైక్‌పై నుంచి తోసి పారిపోయాడని.. అలాంటి వ్యక్తితో ఆ అమ్మాయి బ్రేకప్‌ చేసుకోవడమే బెటర్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్నది ఆ జర్నలిస్ట్‌ వెల్లడించలేదు.

Read Also : Motorola Smartphone: తక్కువ ధరకే మోటోరోలా స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?