Site icon HashtagU Telugu

Elephant Video: ఏనుగులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది మరి, వీడియో వైరల్

Elephants

Elephants

జనావాసాల్లో ఉండే ఏనుగులు వేరు.. అడవుల్లో ఉండే ఏనుగులు.. ఏనుగే కదా సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నిస్తే ఇక అంతే సంగతులు. వాటికి కోపం వస్తే చుట్టుపక్కల ఏమీ మిగతలదు. దానికి కోపం రాకుంటే మాత్రం తన దారిన అది వెళ్లిపోతుంది. కానీ ఈ వీడియోలోని యువకుల చేష్టలతో ఏనుగులకు కోపం వచ్చింది. పదుల సంఖ్యలో ఏనుగులున్నాయి. అయితే మరి దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. అవి ఒక్కసారిగా వెంటపడటంతో పరుగులు తీశారు. అందులో ఇద్దరు పారిపోతుండగా, మరో వ్యక్తి కింద పడిపోయాడు. ఆ తర్వా తేరుకొని వెంటనే పరుగు తీశాడు. లేదంటే ప్రాణాలు కోల్పోయేవాడు.

ముగ్గురు స్నేహితులు ఏనుగులతో సెల్ఫీ దిగబోయి ప్రమాదంలోంచి తృటిలో బయటపడ్డారు. ఈ సంఘటన యూపీ రాష్ట్రంలోని లఖింపూర్‌ఖేరీ జిల్లాలో జరిగింది. ఏనుగుల గుంపుతో సెల్ఫీ దిగేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులకు ఏనుగులు చుక్కలు చూపించాయి. యువకుల చేష్టలతో ఒక్కసారిగా రెచ్చిపోయిన గజరాజుల మంద వారి వెంట పడి పరుగెత్తించింది.. దీంతో వారు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని పారిపోయేందు ప్రయత్నించారు.

ఈ క్రమంలో కింద పడుతూ లేస్తూ పరుగులు పెట్టారు. ముగ్గురిలో ఓ యువకుడు పాపం కింద పడిపోయాడు. కానీ మళ్లీ లేచి పరిగెత్తాడు. ముగ్గురు యువకులను ఏనుగుల మంద వెంబడించగా, అక్కడే ఉన్న ఓ యువకుడు ఈ ఘటనను తన కెమెరాలో బంధించాడు. ఏనుగుల దగ్గర సెల్ఫీలు దిగడం కోసం ప్రయత్నించిన ముగ్గురు స్నేహితులకు దాదాపు మరణం అంచులదాకా వెళ్లివచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Rangabali Review: రంగబలి మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?