స్నేహితులతో సరదాగా మొదలైన పందెం ఓ యువకుడి ప్రాణాలు పోయేలా చేసిన విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల కార్తీక్ అనే యువకుడు, తన స్నేహితులతో కలిసి మద్యం తాగడంలో ఓ ఛాలెంజ్ తీసుకుని, నీరు కలపకుండా ఐదు బాటిళ్లు మద్యం తాగేందుకు సాహసించాడు. ఈ పోటీకి తన స్నేహితుడు వెంకట రెడ్డి రూ.10,000 బహుమతి ప్రకటించడంతో కార్తీక్ పందెంలో పాల్గొన్నాడు. అతిగా మద్యం సేవించిన కార్తీక్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేరాడు.
Vastu Tips: ఇకపై ప్రతి గురువారం ఇలా చేస్తే మీ ఇంట డబ్బే డబ్బు!
వైద్యులు చికిత్స అందించినా కార్తీక్ శరీరం స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే అతడు తుదిశ్వాస విడిచాడు. నీరు కలపకుండా మద్యం సేవించడం వల్ల అతడి శరీరంలో నష్ఠమయిన జలానుపాతమే ఈ విషాదానికి ప్రధాన కారణమని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్ మృతితో అతడి కుటుంబంలో శోకం అలుముకుంది. మద్యం పందేల వల్ల కలిగే ప్రమాదాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. కార్తీక్ కు ఏడాది క్రితం పెళ్లి కాగా, అతడి భార్య ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన కేవలం 8 రోజుల్లోనే ఆమె భర్తను కోల్పోవడంతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.