తెలుగు ప్రేక్షకులకు కమెడియన్, డైరెక్టర్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న వేణు తాజాగా బలగం సినిమాతో డైరెక్టర్ గా మారి పెద్ద పెద్ద ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా బలగం సినిమా పేరు వినిపిస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఆశించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టాల్సిందే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గుర్రం ప్రవీణ్ అనే ఒక యువకుడు మృతి చెందాడు. అసలేం జరిగిందంటే.. బలగం సినిమాను పబ్లిక్ స్క్రీన్ లో చూస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఇద్దరూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు.
ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య గొడవ పెద్దదిగా కావడంతో ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. వీరి ప్రత్యర్థి వర్గం ఇనుపరాడ్ల దాడి చేయడంతో గుర్రం ప్రవీణ్ వెంకటేషులకు తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అది గమనించిన స్థానికులు వెంటనే వెంకటేష్ ను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ తరలించారు. కాగా ప్రవీణ్ మరణానికి కారణం శివరాత్రి నరేష్ భాగ్యరాజ్ గా భావిస్తున్నారు. ఆ ఇద్దరు యువకులు ప్రత్యతి వర్గంపై దారుణంగా దాడి చేసి ప్రవీణ్ చావుకి కారణమైనట్లు పోలీసులు వెల్లడించారు.